Begin typing your search above and press return to search.

పొన్నియిన్ సెల్వన్.. ఓటీటీ డీల్ క్లోజ్

By:  Tupaki Desk   |   12 Sep 2022 12:39 PM GMT
పొన్నియిన్ సెల్వన్.. ఓటీటీ డీల్ క్లోజ్
X
తమిళ చరిత్రలో బాగా పాపులర్ అయిన హిస్టారికల్ కల్కి నవల పొన్నియిన్ సెల్వన్ చరిత్రను తీసుకురావాలి అని చాలామంది స్టార్ హీరోలు ప్రయత్నాలు చేశారు. అందులో కమల్ హాసన్ రజనీకాంత్ కూడా ఉన్నారు. గతంలోనే కొంతమంది ప్రముఖ దర్శకులు కూడా ఆ సినిమాను భారీ స్థాయిలోనే నిర్మించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆ కథను తెరపైకి భారీ స్థాయిలోనే తీసుకు వస్తున్నాడు.

సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఆర్య కార్తి అలాగే ప్రముఖ నటుడు విక్రమ్ కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ త్రిష మరి కొంతమంది ప్రముఖ హీరోయిన్స్ కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే తమిళంలో తప్పితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగులో పెద్దగా అయితే హైప్ క్రియేట్ చేయలేదు. అలాగే మిగిలిన భాషల్లో కూడా అంతంతమాత్రంగానే హైప్ క్రియేట్ అవుతుంది. దీంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా కాస్త సందేహంగానే ఉంది. దాదాపు రెండు భాగాలకు కలిపి ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ముందుగా ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే సెకండ్ పార్ట్ బిజినెస్ కు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ నిర్మాతలతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అసలైతే కేవలం ఫస్ట్ పార్ట్ ఓటిటి హక్కుల కోసం సంప్రదించారట. కానీ ఆ తర్వాత మళ్లీ రెండు భాగాల కోసం డీల్ మాట్లాడాల్సి వచ్చింది.

మొత్తంగా అన్ని భాషలకు కలుపుకొని ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ 125 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మధ్యలో హాట్ స్టార్ కూడా ఈ సినిమా పోటీటీ హక్కుల కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ అమెజాన్ ప్రైమ్ భారీగా ఆఫర్ చేయడంతో నిర్మాతలు టెంప్ట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ అయితే దాదాపు క్లోజ్ అయినట్లు సమాచారం. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.