Begin typing your search above and press return to search.

పొన్నియిన్ సెల్వన్ 1.. కలెక్షన్స్ పరిస్థితి ఇది!

By:  Tupaki Desk   |   14 Oct 2022 3:30 AM GMT
పొన్నియిన్ సెల్వన్ 1.. కలెక్షన్స్ పరిస్థితి ఇది!
X
చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ఫ్యాన్ ఇండియా తమిళ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మొత్తానికి టాక్ ప్రకారం  అయితే సక్సెస్ అయ్యింది. కానీ ఈ సినిమాకు తమిళంలో తప్పితే మిగతా భాషల్లో చాలా వరకు కలెక్షన్స్ అయితే తక్కువగానే వచ్చాయి. ఇతర భాషల్లో సినిమా చేసిన బిజినెస్ బట్టి అయితే ఇంకా మరికొంత కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది కానీ ఇప్పటికే విడుదలై రెండు వారాలకు దగ్గర కావస్తోంది కాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే.

కానీ తమిళంలో మాత్రం పెట్టిన పెట్టుబడికి దాదాపు విక్రమ్ రేంజ్ లోనే ప్రాఫిట్ అందించే దిశగా ఈ సినిమా కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. కేవలం తమిళనాడులోని పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా 160 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం తమిళంలోనే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక మిగతా భాషల్లో మాత్రం పెద్ద స్థాయిలో అయితే వసూలు ఏమి రాలేదు. ఒకప్పుడు విక్రమ్ కార్తి ఇద్దరికీ కూడా తెలుగులో మంచి మార్కెట్ అయితే ఉండేది. అలాగే ఐశ్వర్యరాయ్ త్రిష కూడా తెలుగువారికి తెలియని వాళ్లు కాదు. ఇక మణిరత్నం సినిమా కాబట్టి తప్పకుండా తెలుగులో పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుందని అనుకున్నారు.

కానీ పొన్నియిన్ సెల్వన్ తెనుగు వెర్షన్ కు 10 కోట్లకు మించి రాబట్టే అవకాశం లేదని అనిపిస్తోంది. ఇక హిందీలో ఐశ్వర్యారాయ్ ఏఆర్ రెహమాన్ క్రేజ్ ఉపయోగపడుతుందని అనుకున్నారు. మణిరత్నంకు కూడా అక్కడ మంచి డిమాండ్ అయితే ఉంది. కానీ ఈ తమిళ సినిమాను హిందీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ 20 కోట్లు వచ్చినట్లు టాక్.

మొత్తానికి ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా అయితే ఈ సినిమా సక్సెస్ కాలేదు. కానీ తమిళ భాషల్లో మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో మణిరత్నంకు మళ్ళీ సెకండ్ పార్ట్ తీసే ధైర్యాన్ని అయితే ఇచ్చింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 415 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 213 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.