Begin typing your search above and press return to search.

పొన్నియిన్ సెల్వన్ 1.. పాటల రేటు ఎంతంటే?

By:  Tupaki Desk   |   8 July 2022 12:30 PM GMT
పొన్నియిన్ సెల్వన్ 1.. పాటల రేటు ఎంతంటే?
X
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి చాలా రోజుల తర్వాత మరొక బిగ్ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాను లైకా ప్రొడక్షన్స్ తో పాటు మణిరత్నం కూడా తన సొంత ప్రొడక్షన్లో సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలోని ఫస్ట్ భాగం సెప్టెంబర్ 30న ఫ్యాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. తప్పకుండా సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకోవాలి అని మణిరత్నం ప్రమోషన్స్ స్థాయి కూడా పెంచే విధంగా అడుగులు వేస్తున్నాడు.

చోళుల సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీక్ త్రిష అలాగే మరి కొంతమంది ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా ఆడియో హక్కులను దక్కించుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడ్డాయి.

ఇక ఫైనల్ గా టిప్స్ సంస్థ ఈ సినిమా ఆడియోకులను భారీ దరకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట దాదాపు 30 కోట్ల వరకు అమ్ముతున్నట్లు ఒక టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ 24 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో తమిళంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆడియో రైట్స్ ఇవే.

ఈ సినిమాపై అంచనాలు అయితే కేవలం తమిళంలోనే ఉన్నాయి ఇక మిగతా భాషల్లో అయితే పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. మణిరత్నం మాత్రం సినిమాలకు గతంలో తెలుగు హిందీ మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉండేది.

కానీ ఆయన కొన్నేళ్ళ అనంతరం వరుసప జయాలతో మార్కెట్ ను పోగొట్టుకున్నాడు. ఇక ఇప్పుడు చాలాకాలం తర్వాత ఒక బిగ్ బడ్జెట్ సినిమాతో పాన్ ఇండియా ప్రపంచంలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.