Begin typing your search above and press return to search.

పాలిటిక్స్‌.. మూవీస్‌..ప‌వ‌ర్ స్టార్ ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!

By:  Tupaki Desk   |   29 Oct 2022 3:32 PM GMT
పాలిటిక్స్‌.. మూవీస్‌..ప‌వ‌ర్ స్టార్ ఎక్క‌డా త‌గ్గ‌ట్లే!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా సినిమాల‌ని, రాజ‌కీయాల‌ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. గ‌తంలో సినిమాల‌కు దూరంగా వుంటాన‌ని, రాజ‌కీయాల‌కే పరిమితం అవుతాన‌ని ప్ర‌క‌టించిన‌ప‌వ‌న్ క‌ల్యాణ్ దాదాపు మూడున్న‌రేళ్లు జ‌న‌సేన పార్టీ కార్య‌కలాపాల్లో బిజీ అయిపోయారు. సినిమాల‌కు కంప్లీట్ గా దూర‌మైపోయారు. అయితే ఫ్యాన్స్ కోరిక మేర‌కు మ‌ళ్లీ మూడున్న‌రేళ్ల త‌రువాత సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టారు.

'వ‌కీల్ సాబ్‌' సినిమాతో మ‌ళ్లీ కెమెరా ముంద‌కొచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాతో తాను సినిమాల‌కు దూరం కాలేద‌ని, న‌టన కంటిన్యూ చేస్తూనే క్రియాశీల రాజ‌కీయాల్లోనూ వుంటానంటూ క్లారిటీ ఇచ్చారు. గ‌త కొంత కాలంగా ఏపీ రాజ‌కీయాల కార‌ణంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు.

దాంతో ప‌వ‌న్ న‌టిస్తున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌డానికి ప్ర‌త్యేకంగా వ‌ర్క్ షాప్ ని నిర్వ‌హించారు.

ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పాల్గొన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇదిలా వుంటే రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' త‌దుప‌రి షెడ్యూల్ మొద‌లైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్, నిధి అగ‌ర్వాల్ ల‌తో పాటు ప‌లువురు తారాగ‌ణం పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కి బ్రేకిచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం వైజాగ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గ‌న్న‌వ‌రం ఏయిర్ పోర్ట్ లో ప్ర‌త్య‌క్ష్యం కావ‌డంతో ఫ్యాన్స్ షాక‌వుతున్నారు. ప‌వ‌న్ షూటింగ్ ఎప్పుడు చేస్తున్నారు... ఎప్పుడురాజ‌కీయాల‌కు కేటాయిస్తున్నార‌ని అభిమానులు అవాక్క‌వుతున్నారు. శనివారం ఏపీ వెళ్లిన ప‌వ‌న్ మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో విశాఖ నేత‌ల‌తో ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా విశాఖ అక్రమ కేసుల్లో జైలు పాలై.. హైకోర్టు ఇచ్చిన బెయిలుతో విడుదలైన తొమ్మిది మంది జనసేన నాయకులను పార్టీ అధ్యక్షులు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆత్మీయంగా సత్కరించారు. ఈ ప‌ర్య‌ట‌న అనంత‌రం ప‌వ‌న్ మ‌ళ్లీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ లో పాల్గొంటార‌ట‌. ఇలా సినిమాల‌కు, పార్తీ కార్య‌క‌లాపాల‌కు స‌మానంగా స‌మ‌యాన్ని కేటాయిస్తున్న ప‌వ‌న్ ని చూసిన అభిమానులు ఎక్క‌డా త‌గ్గ‌ట్లే అని హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.