Begin typing your search above and press return to search.
విజయ్ రాజకీయ చర్చ మళ్లీ మొదలయ్యింది
By: Tupaki Desk | 18 Aug 2020 11:00 PM ISTతమిళనాట స్టార్స్ రాజకీయాల్లో అడుగు పెట్టడం రాణించడం కొత్తేం కాదు. ఎంజీఆర్ నుండి మొదలుకుని కమల్ హాసన్ వరకు ఎంతో మంది స్టార్స్ రాజకీయాలు చేశారు. అయితే కొద్ది మంది మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ఉన్నత పదవులు పొందారు. అభిమానులు ఉన్నా కొందరు ఓట్లు దక్కించుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. అందుకే చాలా ఏళ్లుగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లాల వద్దా అనే సందేహంలో ఉన్నాడు. త్వరలోనే ఆయన రాజకీయాల్లో అరంగేట్రం చేయడం కన్ఫర్మ్ అంటున్నారు. ఇక విజయ్ రాజకీయాల గురించి కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో గతంలో పలు సందర్బాల్లో నిరూపితం అయ్యింది. కొందరు ఆయను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ఆయన్ను టార్గెట్ చేసి పదే పదే ఐటీ రైడ్స్ అని ఇతర సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
విజయ్ రాజకీయాల్లో ఎంటర్ అవ్వడం కోసమే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు అనేది కొందరి వాదన. ఇప్పటికే జిల్లాల్లో విజయ్ అభిమాన సంఘాలతో ఆయన తండ్రి చంద్రశేఖర్ చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి విజయ్ పార్టీ పెట్టాలని చంద్రశేఖర్ కూడా బలంగా కోరుకుంటున్నాడట. విజయ్ నుండి మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే విజయ్ ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.