Begin typing your search above and press return to search.

సవ్యసాచికి అన్ని సవ్యమే

By:  Tupaki Desk   |   27 Oct 2018 11:53 AM IST
సవ్యసాచికి అన్ని సవ్యమే
X
అరవింద సమేత వీర రాఘవ సందడి దాదాపు క్లైమాక్స్ చేరుకున్నట్టే. హలో గురు ప్రేమ కోసమే వీకెండ్ పుణ్యమాని కొంత సేఫ్ గానే నడుస్తోంది. పందెం కోడి 2 స్వల్ప నష్టాలు మిగల్చడం ఖాయమని తేలిపోయింది. ఇక నిన్న వచ్చిన వీర భోగ వసంతరాయలు గురించి మాట్లాడ్డానికి కూడా ఎవరూ ఇష్టపడటం లేదు. ఇక వచ్చే శుక్రవారం రాబోతున్న నాగ చైతన్య సవ్యసాచి మీదే అందరు కళ్ళు ఉన్నాయి ఇప్పటికే ట్రైలర్ అంచనాలు పెంచేయగా కీరవాణి ఈజ్ బ్యాక్ అనేలా ఆడియో ఆల్బమ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకోవడంతో అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి.

మాధవన్ మొదటిసారి తెలుగు స్ట్రెయిట్ సినిమాలో విలన్ గా చేయడం హీరో ఎడమ చేయి కంట్రోల్ లో ఉండకపోవడం లాంటి ఆకర్షణలతో ఇప్పటికే దీని మీద మంచి బజ్ ఉంది. నిధి అగర్వాల్ డెబ్యూ మూవీగా సవ్యసాచిలో తన గ్లామర్ మీద కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇప్పటికే వచ్చేసింది. సవ్యసాచి కనక ఈ అవకాశాన్ని వాడుకుంటే మంచి రన్ దక్కే అవకాశం ఉంది. ఆపై రెండు భారీ రిలీజులు ఉన్నప్పటికీ అవి డబ్బింగ్ కావడంతో అంతగా ప్రభావం ఉండకపోవచ్చు. మళ్ళి 16న టాక్సీ వాలా వరకు పెద్దగా సినిమాలేవీ ఉండవు. సో సవ్యసాచికి ఇది భలే ఛాన్స్.

కంటెంట్ కనక మెప్పిస్తే వసూళ్లు కూడా భారీగా దక్కే అవకాశం ఉంది. భూమిక చైతు అక్కయ్య కీలక పాత్ర చేసిన ఈ మూవీలో హీరో విలన్ మధ్య ఇంటెన్స్ డ్రామా కట్టిపడేస్తుందని దర్శకుడు చందు మొండేటి తనదైన శైలిలో స్క్రీన్ ప్లే మేజిక్ చేసాడని ఇప్పటికే ఇన్ సైడ్ బలంగా ఉంది. రంగస్థలం తర్వాత మైత్రి సంస్థ నుంచి వస్తున్న మూవీ కావడం ఆరకంగా కూడా ప్లస్ అవుతోంది. సోలోగా బరిలో దిగుతున్న సవ్యసాచికి అన్ని సవ్యంగా ఉన్నాయి. హిట్టు కొట్టడమే బాలన్స్