Begin typing your search above and press return to search.

ఖాన్‌లకు సెక్యూరిటీ తీసేయమని ఆర్డర్‌

By:  Tupaki Desk   |   10 Jun 2015 3:00 PM IST
ఖాన్‌లకు సెక్యూరిటీ తీసేయమని ఆర్డర్‌
X
ఖాన్‌ల త్రయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ అప్పట్లో పోలీస్‌ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఓ వాహనం ఇద్దరేసి ఎస్కార్ట్‌లను ఈ హీరోల చుట్టూ తిరుగుతూ కాపలా కాసేవారు. అయితే ఇటీవలి కాలంలో పరిణామాలు మారాయి. గ్యాంగ్‌స్టర్‌ యాక్టివిటీస్‌పై పోలీస్‌ డేగకన్ను వేయడంతో ఆగడాలన్నీ ఆగిపోయాయి.

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు బెదిరింపుల్లేక ప్రశాంతంగా బతికేస్తున్నారు. అందుకే ఇక బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు షారూక్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌లకు సెక్యూరిటీతో పనేలేదని భావించిన పోలీస్‌ .. ఇప్పటికే అమలవుతున్న సెక్యూరిటీ వ్యవస్థను కాల్‌ బ్యాక్‌ చేశారు. ఇక నుంచి వీళ్లకు సెక్యూరిటీ అనవసరం. తిరిగి యథావిధిగా మీ విధుల్లో చేరండి.. అని ఆర్డర్స్‌ పాస్‌ చేశారు పోలీస్‌ బాస్‌లు. వాస్తవానికి మాఫియాడాన్‌ రవి పుజారా నుంచి అప్పట్లో షారూక్‌ సహా ఇతర సెలబ్రిటీల ఆఫీస్‌లకు ఫోన్‌కాల్స్‌ వెళ్లాయి. పుజారా గ్యాంగ్‌ స్టర్‌ చోటా రాజన్‌కి బద్ధవిరోధి. అతడితో విభేధించి స్వయంగా తనే ఓ గ్రూప్‌ని ఏర్పాటు చేసి ఈ నేరాలకు పాల్పడుతున్నాడు. తనకి నచ్చనివాళ్లను, తన వ్యాపారాలకు అడ్డు తగిలేవాళ్లను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో హుటాహుటీన పోలీస్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సొచ్చింది.

ముఖ్యంగా బాద్‌షా షారూక్‌ ఖాన్‌ సొంత నిర్మాణ సంస్థకు ఫోన్‌ చేసిన పుజారా అనుచరులు అలీ, కరీమ్‌ మొరానీ లాంటి ఫిలింమేకర్స్‌కి సహకరిస్తే షారూక్‌ని చంపేస్తామంటూ బెదిరించారు. అప్పట్నుంచి ఈ తంతు నడుస్తోంది. ఎట్టకేలకు సెక్యూరిటీ తొలగింపు ఖరారైంది.