Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో ఇంటి నేమ్‌ ప్లేట్ తొలగించిన పోలీసులు

By:  Tupaki Desk   |   31 May 2022 4:05 AM GMT
స్టార్‌ హీరో ఇంటి నేమ్‌ ప్లేట్ తొలగించిన పోలీసులు
X
బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో తన సినిమాలతో రికార్డులతో వార్తల్లో నిలిచిన షారుఖ్ ఖాన్‌ ఈమద్య కాలంలో కొడుకు డ్రగ్స్ కేసు కారణంగా వార్తల్లో నిలిచాడు. మళ్లీ సినిమాలతో ఆయన బిజీ అవుతాడు అనుకుంటున్న సమయంలో మరో చిన్న విషయంతో వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆయన పోలీసుల నోటీసు అందుకోవడంతో హాట్ టాపిక్ అయ్యింది.

ముంబయిలో అత్యంత ఖరీదైన కొన్ని ఇళ్లలో షారుఖ్‌ ఖాన్‌ కుటుంబం నివాసం ఉంటున్న మన్నత్‌ ఒకటి అనడంలో సందేహం లేదు. భూతల స్వర్గం అన్నట్లుగా ఉండే మన్నత్‌ ను ఎప్పటికప్పుడు కొత్త హంగులు అద్దుతూ ఉంటాడు.

ఇటీవల ఇంటికి అత్యంత ఖరీదైన స్టోన్‌ తో నేమ్‌ ప్లేట్ చేయించాడు. యూరప్ నుండి వచ్చిన ఆ అరుదైన స్టోన్ నేమ్ ప్లేట్‌ ను చేయించడంతో దాన్ని కాపాడేందుకు పోలీసులు కష్టపడాల్సి వస్తుందట.

పోలీసులు ఆ స్టోన్‌ ను ఎవరైనా దొంగిలించే అవకాశం ఉందంటూ షారుఖ్ కు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో మీ అరుదైన నేమ్‌ ప్లేట్‌ ను తొలగించాల్సిందే. లేదంటే ఆ నేమ్ ప్లేట్ ను తాము తొలగించాల్సి వస్తుందంటూ నోటీసులో పేర్కొన్నారట. పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేసి నేమ్ ప్లేట్ ను చేయించిన షారుఖ్‌ ఖాన్‌ ఇప్పుడు దాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సి వచ్చింది.

పోలీసుల నోటీసుకు స్పందించిన షారుఖ్‌ ఖాన్‌ ఆ నేమ్ ప్లేట్ ను ఇప్పటికే తొలగించారని తెలుస్తోంది. ఎంత భారీ ఇళ్లు అయినా... ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా పాతిక లక్షలతో నేమ్‌ ప్లేట్‌ ఎందుకో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక షారుఖ్‌ సినిమాల విషయానికి వస్తే.. పఠాన్ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతి త్వరలోనే అట్లీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేస్తున్నాడు.