Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పబ్ పై పోలీసుల ఆకస్మిక దాడులు

By:  Tupaki Desk   |   11 Dec 2021 12:30 PM GMT
టాలీవుడ్ పబ్ పై పోలీసుల ఆకస్మిక దాడులు
X
అదో టాలీవుడ్ పబ్. ఎక్కువగా సినీ, బుల్లితెర నటీనటులు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారని బయట టాక్.. అలాంటి పబ్ పై పోలీసులు దాడులు చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.గతంలో పబ్ ను హెచ్చరించినా యాజమాన్యం తీరు మార్చుకోలేదని పోలీసులకు కంప్లైట్ అందింది.

పోలీసులు పబ్ పై దాడి చేసిన అనంతరం మీడియాకు వివరాలను వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా టాలీవుడ్ పబ్ ను నిర్వహిస్తున్నారని తేల్చారు. పబ్ లో వికృత చేష్టలకు పాల్పడుతున్న 9 మంది యువతులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాలీవుడ్ పబ్ లో సమయం దాటిన తర్వాత కూడా యువతీ యువకులు అర్థనగ్న డ్యాన్స్ లు చేస్తున్నారని వెల్లడించారు.

ఇటీవల కాలంలో ఈ పబ్ పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు కలిసి దాడులు నిర్వహించి పబ్ కు నోటీసులు అందజేశామని పబ్ తీరు మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ పబ్ ఉందన్నారు.

ఇటీవలే పబ్ కు వచ్చిన భార్యభర్తలపై కొందరు దురుసుగా ప్రవర్తించడంతో పాటు పబ్ సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు పబ్ ను సీజ్ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.