Begin typing your search above and press return to search.
నటి మాధవీలతకు పోలీసుల కౌంటర్?
By: Tupaki Desk | 2 Sept 2020 3:20 PM ISTసినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. టాలీవుడు ప్రముఖులు పార్టీల్లో డ్రగ్స్ వాడటం కామన్ అంటూ మాధవీలత పెట్టిన పోస్ట్ కలకలం రేపింది. దీనిపై ఎన్.సీబీ అధికారులు, ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆమె పోస్టులో కోరారు.
మాధవీలత తాను ఐదేళ్ల క్రితం ఓ పార్టీకి వెళ్లినప్పుడు పలువురు సెలెబ్రెటీలు డ్రగ్స్ తీసుకోవడం చూశానని ఆమె చెప్పుకొచ్చింది. అప్పట్లో భయంతో ఈ విషయాలను బయటపెట్టలేకపోయానని అందామె.. ఎందుకంటే దీనివెనుక పెద్ద మాఫియాలు ఉంటాయని తెలిపింది.ఇప్పటికీ భయం ఉన్నా బాధ్యతల బీజేపీలో ఉన్నందున ఈ విషయాన్ని చెప్పానని తెలిపింది.
కాగా నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
డ్రగ్స్ కేసులో ఇప్పటికే అనేకమందిని అరెస్ట్ చేశామని.. టాలీవుడ్ సెలెబ్రెటీలను విచారించామని.. కొందరిని నిఘాలో పెట్టామని.. ఆధారాలుంటే టాలీవుడ్ సెలెబ్రెటీలను వదలమని ఎక్సైజ్ పోలీసులు మాధవీలతకు స్పష్టం చేశారు. దీంతో టాలీవుడ్ డ్రగ్స్ దందా మరోసారి బయటపడింది.