Begin typing your search above and press return to search.

న‌గ్న ఫోటోషూట్ ప్ర‌కంప‌నం.. ర‌ణ్ వీర్ పై పోలీస్ కేసు!

By:  Tupaki Desk   |   26 July 2022 4:15 AM GMT
న‌గ్న ఫోటోషూట్ ప్ర‌కంప‌నం.. ర‌ణ్ వీర్ పై పోలీస్ కేసు!
X
రణ్ వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ప్ర‌కంప‌నాల గురించి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఇది అంత‌ర్జాలంలో బిగ్ డిబేట్ గా మారింది. సింగ్ త‌ర్వాత ప‌లువురు హీరోలు అత‌డిని అనుస‌రిస్తూ న‌గ్న ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్లో బోలెడంత ప్ర‌చారం చేసుకున్నారు. ఇక ర‌ణ్ వీర్ న‌గ్న ఫోటోషూట్ కి ప‌రిశ్ర‌మ న‌టీన‌టులు ప్ర‌ముఖుల నుంచి మద్ధ‌తు ల‌భించ‌గా నెటిజ‌నుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇప్పుడు అతనిపై కేసు నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోల‌తో మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు రణ్ వీర్ పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాలని కోరుతూ సోమవారం ముంబై పోలీసులకు ఒక దరఖాస్తు దాఖలు చేసినట్లు జాతీయ మీడియా నివేదించింది.

తూర్పు ముంబై సబర్బ్ లో ఉన్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (NGO) ఆఫీస్ బేరర్ చెంబూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దరఖాస్తును సమర్పించారు. ఫిర్యాదుదారుడు త‌న ఫోటోషూట్ తో ర‌ణ్ వీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశాడని వారి నిరాడంబరతను అవమానించాడని పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. ర‌ణ్ వీర్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - ఇండియన్ పీనల్ కోడ్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేశారు. ''సోమవారం ఒక ఎన్జీవోతో సంబంధం ఉన్న వ్యక్తి నుండి మాకు దరఖాస్తు వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌.ఐ.ఆర్ నమోదు కాలేదు. మేం విచారిస్తున్నాం''అని ఒక పోలీస్ అధికారి మీడియాకి తెలిపారు.

తన ఫోటో షూట్ ద్వారా ర‌ణ్ వీర్ అమెరికన్ పాప్ సంస్కృతికి చిహ్నంగా పరిగణించే లెజెండరీ నటుడు బర్ట్ రేనాల్డ్స్ కు నివాళులర్పించాడు. ప్ర‌ఖ్యాత‌ మ్యాగజైన్ కోసం బర్ట్ రేనాల్డ్స్ క్లాసిక్ డే ఫోటోషూట్ ని పునఃసృష్టిస్తూ నగ్నంగా రగ్గుపై పడుకుని ర‌ణ్ వీర్ కెమెరాల‌కు ఫోజులిచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రణ్ వీర్ సింగ్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ స్పెష‌ల్ షో ''రణ్ వీర్ వర్సెస్ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్''లో కనిపించాడు. అతను బేర్ గ్రిల్స్ తో కలిసి అడవిలోకి చాలా సాహసయాత్రకు వెళ్లాడు. కఠినమైన భూభాగాల్లో ప్ర‌యాణిస్తూ స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎదుర్కోవడం నుండి సైబీరియన్ అడవిలోకి వెళ్లడం వరకు ప్ర‌తిదీ ఉత్కంఠ‌ను క‌లిగించాయి.

ఇక అడ‌వుల్లో ఎలుగుబంటి వెంబడించే అరుదైన పువ్వు కోసం పర్వతారోహ‌ణం చేయడం.. పుష్పం కోసం వెతుకులాట అడ్వెంచ‌ర‌స్ గా క‌నిపించాయి. ర‌ణ్ వీర్ ఇటీవ‌ల ఆలియా భట్ తో కలిసి కాఫీ విత్ కరణ్ సీజ‌న్ 7 లో కూడా కనిపించాడు. త‌దుప‌రి ఆలియాతో 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' మూవీలో ర‌ణ్ వీర్ న‌టిస్తున్నాడు. రోహిత్ శెట్టి 'సర్కస్‌'లోను న‌టిస్తున్నాడు.

ర‌ణ్ వీర్ ని వీడీ ఫాలో చేస్తాడా?

బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ స్టైల్ స్టేట్ మెంట్ ని అనుస‌రించేందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటారు. ఇటీవ‌ల లైగ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో ఫ్యాష‌నిస్టా ర‌ణ్ వీర్ కే షాక్ లిచ్చాడు విజ‌య్. వేదిక‌పైకి అల్ట్రా పోష్ లుక్ తో దూసుకొచ్చిన వీడీ కేవ‌లం రూ.150 ఖ‌రీదు చేసే అవాయి చెప్పులు ధ‌రించాడు. ఇది కూడా గొప్ప ఫ్యాష‌న్ అంటూ ర‌ణ్ వీర్ అత‌డిని పొగిడేశాడు. ఇలాంటి వేష‌ధార‌ణ‌కు ర‌ణ్ వీర్ స్ఫూర్తి. అందుకే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా న‌గ్న ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌స్తాడా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. దీనికి వీడీ ఏమ‌ని జవాబు చెబుతాడో!