Begin typing your search above and press return to search.

ఆర్మీ డ్రెస్ ను అపహాస్యం చేశారట.. లేడీ ప్రొడ్యూసర్ పై కంప్లైంట్

By:  Tupaki Desk   |   18 May 2020 7:10 PM IST
ఆర్మీ డ్రెస్ ను అపహాస్యం చేశారట.. లేడీ ప్రొడ్యూసర్ పై కంప్లైంట్
X
సినీ నిర్మాణ రంగం.. ప్రత్యేకించి టీవీ సీరియళ్ల నిర్మాణంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ మహిళా నిర్మత ఏక్తా కపూర్ ఇబ్బందుల్లో పడిపోయారు. ఓ వ్యక్తి ఆమెపై ఏకంగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఫిర్యాదును పరిశీలిస్తూ ముంబై సైబర్ క్రైం పోలీసులు ఏక్తా కపూర్ కు నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారట. టీవీ సీరియళ్ల నిర్మాణంలో అగ్రగామిగా నిలిచిన బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేత్రి ఏక్తా కపూర్.. తన సీరియళ్ల నిర్మాణంలో తనదైన శైలి ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడపాదడపా పలు సమస్యలు రేకెత్తుతున్నా.. సీరియళ్ల నాణ్యత విషయంలో ఏక్తా కపూర్ మెరుగ్గానే రాణిస్తున్నారనే చెప్పాలి.

అయితే తాజాగా ఆమె నిర్మించిన ఓ వెబ్ సిరీస్ లో ఆర్మీ డ్రెస్ ను అభ్యంతరకర రీతిలో చూపారట. ఈ వెబ్ సిరీస్ ఇంకా రిలీజ్ కాకున్నా... దాని ట్రైలర్ ను ఆమె తన ఫేస్ బుక్ పేజీలో విడుదల చేశారట. ఈ ట్రైలర్ చూసిన విశాల్ కుమార్ అనే వ్యక్తి... సదరు ట్రైలర్ లో ఆర్మీ యూనీఫాంను ఏక్తా కపూర్ అపహాస్యం చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ వెంటనే ఆయన నేరుగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి... ఏక్తా కపూర్ పై కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ ను తీసుకున్న సైబర్ క్రైం పోలీసులు... పూర్తి వివరాలను పరిశీలించి ఏక్తా కపూర్ కు నోటీసులు పంపుతామని చెబుతున్నారు. మొత్తంగా ఆర్మీ డ్రెస్ ను అభ్యంతరకరంగా చిత్రీకరించిన వైనానికి ఏక్తా కపూర్ పోలీసుల నుంచి నోటీసులు తీసుకునే ప్రమాదంలో పడిపోయారన్న మాట.

అయినా ఈ వెబ్ సిరీస్ నేపథ్యం ఏమిటన్న విషయానికి వస్తే... ఆర్మీలో పనిచేస్తున్న ఓ అధికారి కుటుంబ నేపథ్యం ఆధారంగా ఏక్తా కపూర్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారట. అందులో ఆర్మీ అధికారి సతీమణికి, వేరే వ్యక్తి మధ్య నెలకొన్న సంబంధాల నేపథ్యంగా మొత్తం సిరీస్ సాగనుందట. ఈ క్రమంలో సదరు ఆర్మీ అధికారి సతీమణి, వేరే వ్యక్తికి మధ్య నెలకొన్న సంబంధాలను ట్రైలర్ లో చూపించారట. ఈ క్రమంలోనే ఆర్మీ డ్రెస్ ను బాలాజీ టెలి ఫిలిమ్స్ అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారట. ట్రైలర్ లోనే ఈ వివాదం నెలకొంటే.. ఇక పూర్తి స్థాయి వెబ్ సిరీస్ లో ఆర్మీని, ఆర్మీ డ్రెస్ ను ఏక్తా కపూర్ సంస్థ ఏ రేంజిలో చిత్రీకరించారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.