Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అండ్ హీరో పై పోలీస్ కేస్‌?

By:  Tupaki Desk   |   11 March 2022 10:30 AM GMT
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అండ్ హీరో పై పోలీస్ కేస్‌?
X
టాలీవుడ్ లో ఫైనాన్షియ‌ర్ ల‌కు ప్రొడ్యూస‌ర్ ల‌కు మ‌ధ్య అప్పుడ‌ప్పుడు చిన్న చిన్న విష‌యాల్లో విభేదాలు త‌లెత్త‌డం కామ‌న్ కానీ అవి పోలీస్ స్టేష‌న్ ల వ‌ర‌కు వెళ్లిన సంద‌ర్భాలు చాలా అరుదు. కానీ తాజాగా ఓ ఫైనాన్షియ‌ర్ ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, స్టార్ హీరో పై పోలీస్ కేస్ పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌ముఖ ఫైనాన్షియ‌ర్ వి.ఎల్‌. శ్ర‌వ‌ణ్‌ కుమార్ టాలీవుడ్ స్టార్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్, ఆయ‌న‌ ఫాద‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్ ల‌పై పోలీస్ కేసు పెట్ట‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధార‌ణ కేసు కాకుండా చీటింట్ కేసు పెట్ట‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ ఇద్ద‌రిపై శ్ర‌వ‌ణ్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్టేష‌న్ లో కేసు ఫైల్ చేశార‌ట‌. బెల్లంకొండ సురేష్‌, హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ 2018-19 మ‌ధ్య‌లో ఓ సినిమా చేస్తాన‌ని త‌న వ‌ద్ద నుంచి 85 ల‌క్ష‌లు తీసుకున్నార‌ని, తిరిగి చెల్లించ‌మంటే చెల్లించ‌డం లేద‌ని స‌ద‌రు ఫైనాన్షియ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, బెల్లంకొండ సురేష్ ల‌పై కేసు పెట్టార‌ట‌.

ఇచ్చిన డ‌బ్బులు తిరిగి చెల్లించ‌మ‌ని అడుగుతుంటే త‌న‌ని బెదిరిస్తున్నార‌ని, వారి వ‌ల్ల త‌న‌కు హాని వుంద‌ని ఆరోపిస్తూ శ్ర‌వ‌ణ్ కుమార్ బంజారా హిల్స్ పోలీస్టేషన్ లో కేసు పెట్టడం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.

ఇదిలా వుంటే త‌న వ‌ద్ద 85 ల‌క్ష‌లు తీసుకున్న బెల్లంకొండ సురేష్ ఓ సినిమా చేద్దామ‌న్నార‌ని, దానికి త‌న‌ని పార్ట్‌న‌ర్ గా పెడ‌తామ‌న్నార‌ని, అయితే ఆ ప్రాజెక్ట్ ఇంత వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేద‌ని, ఈ విష‌యంలో తాను మోస‌పోయాన‌ని ఆరోపిస్తూ కేసు పెట్ట‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

అయితే శ్ర‌వ‌ణ్ కుమార్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేసి ద‌ర్యాప్తుని ప్రారంభించార‌ని వార్త‌లు ఇండ‌స్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయ‌ట‌. ఇదిలా వుంటే హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం 'ఛ‌త్ర‌ప‌తి' హిందీ రీమేక్ లో న‌టిస్తున్నారు.

వి.వి.వినాయ‌క్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై డా. జ‌యంతిలాల్ గ‌డ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాలీవుడ్ తెర‌కు ప‌రిచ‌యం కానున్న విష‌యం తెలిసిందే.