Begin typing your search above and press return to search.

త‌మిళ బిగ్ బాస్ సెట్ కు తెలంగాణ పోలీసులు..ఆమె అరెస్ట్‌!

By:  Tupaki Desk   |   3 July 2019 7:12 AM GMT
త‌మిళ బిగ్ బాస్ సెట్ కు తెలంగాణ పోలీసులు..ఆమె అరెస్ట్‌!
X
త‌మిళంలో బిగ్ బాస్ సీజ‌న్ రీసెంట్ గా స్టార్ట్ అయిన విష‌యం తెలిసిందే. త‌ర‌చూ వార్త‌ల్లోనూ.. వివాదాల్లోనూ క‌నిపించే వారిని కంటెస్టెంట్లుగా హౌస్ లో ఉంచ‌టం తెలిసిందే. ఇప్పుడ‌లా ఉన్న వారిలో సీనియ‌ర్ న‌టులు మంజుల‌.. విజ‌య్ కుమార్ ల పెద్ద కుమార్తె వ‌నిత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఇప్పుడామెను అరెస్ట్ చేయ‌టానికి తెలంగాణ పోలీసులు త‌మిళ బిగ్ బాస్ సెట్ వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏ క్ష‌ణంలో అయినా ఆమె అరెస్ట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. గ‌తంలో తండ్రితో గొడ‌వ ప‌డి వార్త‌ల్లోకి వ‌చ్చిన ఆమె.. త‌ర్వాతి కాలంలో భ‌ర్త‌తో ఏర్ప‌డిన వివాదాల‌తో వార్త‌ల్లోకి వ‌చ్చారు. తాజాగా భ‌ర్త‌తో విడిపోయిన ఆమె.. త‌న కుమార్తె విష‌యంలో మాజీ భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు.

2007లో ఆనంద్ రాజ్ ను వ‌నిత పెళ్లాడారు. విభేదాల‌తో ఆయన నుంచి 2012లో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుంచి ఒక‌ప్ప‌టి భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య కుమార్తె జోవిత సంర‌క్ష‌ణ బాధ్య‌త విష‌య‌మై వివాదం న‌డుస్తోంది. ఇదిలా ఉంటే నాలుగైదు నెల‌ల క్రితం త‌న కుమార్తెను త‌న‌కు తెలీకుండా వ‌నిత దాచి పెట్టిన‌ట్లుగా ఆనంద్ రాజ్ పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చారు.

దీంతో ఆమెపైన కిడ్నాప్ కేసు నమోదైంది. పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌నిత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా షోలో ఉన్నారు. ఆమె చేసిన నేరానికి సంబంధించి ఆధారాలు ల‌భించిన నేప‌థ్యంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ పోలీసులు చెన్నై చేరుకున‌నారు. బిగ్ బాస్ సెట్ ఉన్న ఈవీపీ ఫిలింసిటీ ప్రాంతానికి చెందిన న‌జ్ర‌త్ పోలీస్ స్టేష‌న్ ను సంప్ర‌దించిన తెలంగాణ పోలీసులు వ‌నిత‌ను అరెస్ట్ చేసేందుకు సాయం చేయాల‌ని కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆమెను ఏ క్ష‌ణంలో అయినా అరెస్ట్ ఖాయ‌మంటున్నారు.