Begin typing your search above and press return to search.

కిక్కు దొంగ అడ్డంగా దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   14 Sep 2015 11:30 AM GMT
కిక్కు దొంగ అడ్డంగా దొరికిపోయాడు
X
డ‌బ్బు చూస్తే ఆశ పుడుతుంది ఎవ‌రికైనా. స‌రిగ్గా ఆ ఆశే ఓ డ్రైవ‌ర్‌ ని దొంగ‌ని చేసింది. స‌ద‌రు దొంగ ఏకంగా 21 ల‌క్ష‌లు - ఓ కార్‌ ని ఎత్తుకెళ్లాడు. కానీ ఇప్పుడు పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయి క‌ట‌క‌టాల పాల‌య్యాడు.. అర్థాంత‌రంగా జీవిత‌మే జైలు పాలైంది. డీటెయిల్స్‌ లోకి వెళితే..

కిక్ 2 చిత్రంతో పాటు ప‌లు సినిమాల్ని పంపిణీ చేసిన‌ డిస్ర్టిబ్యూట‌ర్ వాసుదేవ‌రావ్ ను డ్రైవ‌ర్ న‌మ్మించి మోసం చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌త నెల‌లో 21ల‌క్ష‌ల క్యాష్‌ - స్కోడా కారు ఎత్తుకుని ఉడాయించాడు స‌ద‌రు డ్రైవ‌ర్‌. డ‌బ్బుకి - కార్‌ కి భ‌రోసాగా ఉండాల్సిన స‌ద‌రు డ్రైవ‌ర్ దారుణంగా మోసం చేశాడు. వాసుదేవ‌రావు త‌న స్వ‌గృహం సుచిత్ర నుంచి బంజారాహిల్స్‌ లోని త‌న ఆఫీస్‌ కి వ‌చ్చిన అనంత‌రం ఆఫీస్ బ‌య‌టే కార్‌ లో వెయిట్ చేయాల్సిందిగా వాసుదేవ‌రావ్ డ్రైవ‌ర్‌ కి చెప్పి లోని కెళ్లాడు. అత‌డు తిరిగి వ‌చ్చేప్ప‌టికి అక్క‌డ డ్రైవ‌ర్ క‌నిపించ‌లేదు. కారు, అందులోని 21 ల‌క్ష‌లు మాయం. డ్రైవ‌ర్ కారుతో స‌హా డ‌బ్బు స్వాహా చేసి ఎటో వెళ్లిపోయాడు.

అయితే ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు డీల్ చేస్తున్నారు. ఇప్ప‌టికి డ్రైవ‌ర్‌ ని ప‌ట్టుకున్నారు. కార్ స‌హా 18.5 ల‌క్ష‌లు అత‌డి వ‌ద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన కిక్ 2 పంపిణీదారులు - నిర్మాత‌ల‌కు తీవ్ర‌మైన న‌ష్టాన్ని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కిక్ 2 పంపిణీదారుడికి జ‌రిగిన మోసం హైలైట్ అయ్యింది.