Begin typing your search above and press return to search.

ఐస్మార్ట్ శంకర్ అక్కడే షాక్ ఇస్తాడు

By:  Tupaki Desk   |   6 Jun 2019 9:19 AM GMT
ఐస్మార్ట్ శంకర్ అక్కడే షాక్ ఇస్తాడు
X
దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో రామ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వేగంగా తీస్తాడని పేరున్న పూరి దీనికి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ క్వాలిటీ పరంగా ఎక్కువ ఫోకస్ పెట్టడంతో కొంత ఆలస్యం కాక తప్పలేదని యూనిట్ మాట. ఇదిలా ఉండగా కాన్సెప్ట్ ఏంటో టీజర్ లో చెప్పీ చెప్పనట్టు చూపించిన ఐస్మార్ట్ శంకర్ లో మహేష్ బాబు పోకిరి తరహాలో ఊహించని మలుపులు చాలా ఉన్నాయట.

ముఖ్యంగా హీరో శంకర్ పాత్ర అంత ఊర మాస్ గా ఎందుకు ప్రవర్తిస్తుందనేది చాలా ఇంటరెస్టింగ్ గా డీల్ చేశారట. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రామ్ పాత్ర మైండ్ స్వాపింగ్ కు గురవుతుంది. అంటే శరీరం తనదే అయినప్పటికీ మెదడు మాత్రం ఏదో చిప్ వల్ల అనూహ్య మార్పులు చెంది పూర్వ జీవితానికి సంబంధం లేకుండా ప్రవర్తించడం. అందుకే ఇంకో పేరుతో ఉన్న మాములు వ్యక్తి ఐస్మార్ట్ శంకర్ గా విశ్వరూపం చూపిస్తాడు. ఇది ప్రచారంలో ఉన్న టాక్

ఇది నిజమైనా కాకపోయినా పూరి తన మార్కు హీరోయిజంతో ఐస్మార్ట్ శంకర్ లో అన్ని మసాలాలు సరైన సమపాళ్ళలో కూర్చినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ఒరిజినల్ బ్యాక్ డ్రాప్ కి సంబంధించి ట్విస్ట్ షాక్ ఇచ్చేలా సాగుతుందట. గతంలో పోకిరిలో ఇదే తరహాలో కృష్ణమనోహర్ ఐపిఎస్ అంటూ పండు పాత్రను మలుపు తిప్పిన తీరు ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేరు. దానికి తోడైన మణిశర్మ మేజిక్ ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. అంతకు మించి అనే తరహాలో ఐస్మార్ట్ శంకర్ ట్విస్ట్ ఇస్తాడట. కాకతాళీయంగా ఇప్పుడూ మణిశర్మే అండగా ఉంటున్నారు. నిధి అగర్వాల్ నభ నటేష్ హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ మూవీ జులైలో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది