Begin typing your search above and press return to search.
పవన్ ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట
By: Tupaki Desk | 12 Aug 2021 8:00 PM ISTపవన్ కళ్యాణ్ మరియు రానాలు కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అల్యూమీనియం ఫ్యాక్టరీలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పవన్ మరియు రానాల మద్య సాగే ఆ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఒరిజినల్ వర్షన్ ను చూసిన కొందరు పవన్ పాత్ర పూర్తి స్థాయిలో మాస్ ఎలిమెంట్స్ ను కలిగి ఉండక పోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా ఆ పాత్రను మార్చారని తెలుస్తోంది.
దర్శకుడు సాగర్ చంద్ర ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా కు డైలాగ్స్ అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పాత్ర పై త్రివిక్రమ్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఇటీవలే ప్రకటించారు. సెకండ్ వేవ్ కు ముందు ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచి పోయింది.
పవన్ కళ్యాణ్ కు కరోనా రావడం.. ఆ తర్వాత సెకండ్ వేవ్ రావడం వంటి కారణాల వల్ల సినిమా దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు సినిమా ను పునః ప్రారంభించిన నేపథ్యంలో పవన్ లుక్ ను రివీల్ చేయడంతో పాటు పాత్ర పేరును భీమ్లా నాయక్ అంటూ రివీల్ చేయడం జరిగింది. పోలీస్ గా భీమ్లా నాయక్ పాత్రలో పవన్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రానా లుక్ ను మరియు పాత్ర పేరును కూడా రివీల్ చేస్తారేమో చూడాలి. ఇద్దరు హీరోల అభిమానులను పూర్తి స్థాయిలో సంతృప్తి పర్చే విధంగా సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్.