Begin typing your search above and press return to search.
1993లో GIRL కాల్ చేస్తే BOY 2019లో?
By: Tupaki Desk | 1 Aug 2019 10:38 AM ISTఇటీవల కాలంలో తెలుగు సినిమా కథల్లో కొత్తదనం కనిపిస్తోంది. ఇది శుభపరిణామం. ప్రయోగాత్మక కథల్ని ఎంచుకుని నవతరం దర్శకులు కొత్త పంథా సినిమాల్ని తీస్తుండడం ఆడియెన్ కి బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ప్రతిసారీ అవే కథల్ని తిప్పి తిప్పి తీసే కల్చర్ కి పాతరేసింది న్యూట్యాలెంట్. అ! - అర్జున్ రెడ్డి- జెర్సీ-మజిలీ ఇవన్నీ ఈ తరహా ప్రయత్నాలే. మునుముందు ఈ ట్రెండ్ ఇంకా పెనుమార్పునకు దారి తీస్తోందా? అంటే అవుననే అనిపిస్తోంది.
తాజాగా హరి ప్రసాద్ జక్కా అనే కొత్త కుర్రాడు ఎంచుకున్న కాన్సెప్ట్ ఆసక్తిని పెంచింది. 1993 లోని అమ్మాయి 2019 లోని అబ్బాయితో ఫోన్ లో కనెక్ట్ అయితే ? ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే మా `ప్లే బ్యాక్` సినిమా.. అంటూ క్యూరియాసిటీ పెంచారు. ఆగస్టు 5న సినిమాని ప్రారంభిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై పి.ఎన్.కె.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాన్సెప్ట్ వినేందుకు ఆసక్తికరంగానే ఉంది. అయితే తీసే విధానం చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు సింగిల్ లైన్ లో చెబుతున్నది బావున్నా.. తీస్తున్న విధానం మెప్పించడం లేదు. కథ బావున్నా కథనంలో గ్రిప్ ఉండడం లేదు. ప్లేబ్యాక్ చిత్రం థ్రిల్లర్ ఫార్మాట్ లో వచ్చినా లైన్ పరంగా కొత్తదనం కనిపిస్తోందన్న ముచ్చట మీడియాలో సాగుతోంది.
ఈ తరహాలోనే ఇటీవల కొన్ని సినిమాలు వచ్చి ఫెయిలయ్యాయి. ఇటీవల రిలీజైన `డియర్ కామ్రేడ్`కి మంచి స్టోరీ లైన్ కుదిరినా.. సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే పరంగా తేలిపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఇలాంటి తప్పులు నవతరం దర్శకులు చేయకుండా ముందుకెళితేనే సక్సెస్ సాధ్యం అన్న విశ్లేషణ సాగుతోంది.