Begin typing your search above and press return to search.

ఆమె నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

By:  Tupaki Desk   |   13 Oct 2016 5:30 PM GMT
ఆమె నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?
X
ఇప్పుడు బాలీవుడ్ సోషల్ మీడియాల్లో ఒకటే రచ్చ. ఆమె ముఖానికి ఏమైంది? ఏదో సర్జరీ చేయించుకున్నట్లు ఉంది.. అసలు ఆమె పెదాలకు ఏమైంది? వాటికి కూడా సర్జరీ అనుకుంట.. ఆమె ముఖంలో నవ్వు కణాలు సరిగ్గా లేవేంటి? వాటికి కూడా సర్జరీ ఫెయిల్యూరే కారణం.. అంటూ జనాలు ఏకేస్తున్నారు. ఇంతకీ ఈ జనాలంతా మాట్టాడుతోంది ఎవరి గురించి? అవును.. బేఫికర్ హీరోయిన్ వాణి కపూర్ గురించే.

నిజంగా కూడా ఒక హీరోయిన్ ఎవరైనా పరిధులు దాటి తన సెక్స్ ఎప్పీల్ తో చంపేసిందంటే మాత్రం.. వెంటనే నెగెటివ్ రియాక్షన్లు తప్పవు. సరిగ్గా బేఫికర్ విషయంలోఇలాగే జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్లో తన లిప్ లాకులతో.. బికినీ లుక్కులతో.. ఆద్యంతం శృంగారభరితంగా కనిపించే స్ర్కీన్ ప్రెజెన్స్ తో వాణి కపూర్ బాగా ఆకట్టుకుంది. కాని నెటిజన్లు మాత్రం.. నాలుగేళ్ల క్రితం ఆమె శుధ్‌ దేశీ రొమాన్స్ లో ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? అంటూ వెంట్రుకలు పీకేసి.. ఆమె సర్జరీ చేయించుకుంది అంటూ ఏకేస్తున్నారు. కాని చాలా సీన్లలో మనం చూస్తే.. వాణి చేతి కండరాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె పర్ఫెక్ట్ టెన్ ఫిగర్ మెయిన్టయిన్ చేయడం కోసం బహుశా జిమ్ కాస్త ఎక్కువగా చేసినట్లుంది. అందుకే ముఖంలోని ఛాయ.. ప్లస్ ఆ బుజ్జి బుగ్గలూ లాగేశాయి. అంతమాత్రాన ఆమె సర్జరీ చేయించుకుందంటే ఎలా అంటూ బాలీవుడ్ నిపుణులు మండిపడుతున్నారు.

అయితే సామాన్య జనం మాత్రం.. చేయించుకుంది చేయించుకుంది అంటూ వీరే స్వయంగా డాక్టర్ సర్జరీ చేస్తుంటే పక్కనే ఉండి బ్లేడ్ అందించినట్లు కామెంట్లు చేయడం విడ్డూరం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/