Begin typing your search above and press return to search.
మెగాస్టార్ తో 'ఠాగూర్' మాదిరి సినిమాని ప్లాన్ చేస్తున్నారా..?
By: Tupaki Desk | 15 April 2021 8:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరు.. దీని తర్వాత ఒకేసారి రెండు సినిమాలు చేసేలా ప్లాన్స్ చేసుకుంటున్నారని సమాచారం. మోహన్ రాజా డైరెక్షన్ లో 'లూసిఫర్' రీమేక్ మరియు బాబీ సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చిరంజీవి తో బాబీ చేయబోయే సినిమా ఓ కోర్టు డ్రామా అని టాక్ వినిపిస్తోంది. 'ఠాగూర్' మాదిరిగా సమాజంలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపే కథతో ఈ మూవీ రెడీ అవుతందని అంటున్నారు. అదే సమయంలో ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఎమోషన్ తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని వార్తలు వస్తున్నాయి. అలానే దీనికి ''వీరయ్య'' అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే చిరంజీవి లైనప్ లో 'వేదళమ్' రీమేక్ కూడా ఉంది. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు.