Begin typing your search above and press return to search.

రీ-షూట్ కు జై కొడుతున్న హీరోలు!

By:  Tupaki Desk   |   5 Jun 2021 11:00 AM IST
రీ-షూట్ కు జై కొడుతున్న హీరోలు!
X
క‌రోనా మ‌హ‌మ్మారి.. సినీ ప‌రిశ్ర‌మ ష‌ట‌ర్ క్లోజ్ చేయించి చాలా కాల‌మైంది ఏప్రిల్ చివ‌రి నుంచే చాలా వ‌ర‌కు సినిమా షూటింగులు ఆపేశారు. షెడ్యూల్స్ మ‌ధ్య‌లో ఉన్న ఒక‌టీ రెండు చిత్రాలు మాత్ర‌మే కొన్ని రోజులు కొన‌సాగాయి. మే మొద‌లైన‌ త‌ర్వాత దాదాపుగా అన్ని షూటింగుల‌కూ ప్యాక‌ప్ చెప్పేశారు. దీంతో.. మేక‌ర్స్ ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సిన ప‌రిస్థితి. కావాల్సినంత ఫ్రీ టైమ్ దొర‌క‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కూ షూట్ చేసిన సినిమా క్యాసెట్ ను రిపీటెడ్ గా చూస్తూ.. ఔట్ పుట్ చేసుకుంటున్నారు.

అయితే.. ఎక్క‌డో ఒక చోటైనా చిన్న చిన్న మైన‌స్ పాయింట్లు దొర‌క‌డం స‌హ‌జం. అయితే.. మ‌రీ ఆడ్ గా అనిపించిన సీన్స్ ను లేపేయాల‌ని, అవ‌స‌ర‌మైతే రీ-షూట్ కూడా నిర్వ‌హించాల‌ని చూస్తున్నార‌ట‌. ఇందులో బ‌డా సినిమాలు కూడా ఉన్నాయ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. సెకండ్ వేవ్ కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తుండ‌డంతో.. ప‌రిస్థితులు అనుకూలంగా ఉంటే చిన్న‌పాటి షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేయాల‌ని చేస్తున్నార‌ట‌.

ఇందులో మెగాస్టార్ 'ఆచార్య' ఉంద‌ని అంటున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఈ మూవీకి మ‌రో చిన్న షెడ్యూల్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌కుడు కొర‌టాల‌, మెగాస్టార్ క‌లిసి మూవీని చూశార‌ని, ప‌లు క‌ర‌క్ష‌న్స్ నోట్ చేసుకున్నార‌ని టాక్‌. ఎలాగో చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది కాబ‌ట్టి.. ప‌నిలో ప‌నిగా ఆయా స‌న్నివేశాల‌ను కూడా రీ-షూట్ చేస్తే బాగుంటుంద‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది.

ఇక, వెంక‌టేష్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'నార‌ప్ప' కూడా ఇదే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు టాక్‌. అంతా స‌జావుగా ఉంటే.. మే లోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు టైమ్ దొర‌క‌డంతో ఓ రెండు స‌న్నివేశాల ను మ‌ళ్లీ చిత్రీక‌రించాల‌ని చూస్తోంద‌ట యూనిట్. ఫారెస్ట్ లొకేష‌న్స్ లో తీసిన చిత్రాలు అనుకున్న విధంగా రాలేద‌ని భావిస్తున్నార‌ట‌.

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా సైతం ఈ జాబితాలో ఉందంటున్నారు. ఈ చిత్రం షూట్‌ దాదాపుగా పూర్తికావొచ్చింది. ఫ‌స్ట్ హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న అఖిల్ మూవీ విష‌యంలో నాగ్‌చాలా కేరింగ్ గా ఉన్నాడు. అందువ‌ల్ల ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లుమార్లు మూవీ చూసిన నాగ్‌.. ప‌లు క‌రక్ష‌న్స్ చెప్పార‌ట‌.

దీంతోపాటు ప్ర‌భాస్ రాధేశ్యామ్ కూడా రీషూట్ కు వెళ్తున్న‌ట్టు టాక్‌. ప‌లు స‌న్నివేశాల్లో ఇంకా బెట‌ర్ మెట్ రావాల్సి ఉంద‌ని రెబ‌ల్ స్టార్ ఫీల‌య్యాడ‌ట‌. అంతేకాదు.. ఓ పాట కూడా యాడ్ చేయాల్సి ఉన్నందున‌.. ఇవి రెండూ క‌లిపి షూట్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఈ విధంగా.. క‌రోనా ఫ్రీ టైమ్ ద్వారా.. సినిమాల్లో మ‌రింత క్వాలిటీ పెంచేందుకు చూస్తున్నారు మేక‌ర్స్. అందుకే.. కాస్త క‌ష్ట‌మైనా రీ-షూట్ కే జై కొడుతున్నార‌ట‌.