Begin typing your search above and press return to search.

ఫ్లైట్ మిస్సైంద‌ని పీకే పెళ్లి మిస్సైయ్యాడు!

By:  Tupaki Desk   |   2 Dec 2022 11:50 AM GMT
ఫ్లైట్ మిస్సైంద‌ని పీకే పెళ్లి మిస్సైయ్యాడు!
X
న‌టుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమ వివాహం ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈవేడుక‌కు సినీ..రాజ‌కీయ ప్ర‌ముఖంలా హాజ‌ర‌య్యారు. దాదాపు టాలీవుడ్ ప్ర‌ముఖంలా పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి..కింగ్ నాగార్జున స‌హా చాలా మంది సెల‌బ్రిటీలు విచ్చేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ప్రత్యేకంగా హాజ‌ర‌య్యారు.

ఈ వేడుక‌కు జ‌న‌సేన అధిన‌త‌...ప‌వ‌ర్ స్టావ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌ప్ప‌క హాజ‌రై..నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దిస్తార‌ని భావించారు. కానీ పీకే వేడుక‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో అలీ స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డ అంటూ వేడుక వ‌ద్ద ప్ర‌ముఖ‌లో చ‌ర్చ సాగింది. ప‌వన్-అలీ చాలా కాలంగా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

రాజకీయంగా ఇద్ద‌రు వేర్వేరు పార్టీలు అయినా ఇలాంటి వేడుక‌ల్లో త‌ప్పక పాల్గొంటారు. ఎప్ప‌టిక‌ప్ప‌డు సినిమా వేరు..రాజ‌కీయం వేరు అని సెల‌బ్రిటీలంతా చెబుతుంటారు. కానీ అలీ కుమార్తె వేడుక‌లో పీకే క‌నిపించ‌క‌పోవ‌డం అన్న‌ది వెలితిగానే అనిపించింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నా. పెళ్లి కుమార్తె ఫాతిమా కూడా ప‌వ‌న్ అంటే ఎంతో అభిమానిస్తారు.

అలీతో ఏర్ప‌డిన స్నేహం కార‌ణంగా ప‌వ‌న్ ఆ కుటుంబంతో అంతే చ‌నువుగా మెలిగేవారు. కానీ మొన్న‌టి స‌న్నివేశంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింద‌ని మీడియాలో చ‌ర్చ‌కొస్తుంది. అయితే ఈ విష‌యంపై ప‌వన్ క‌ళ్యాణ్ అలీకి ఫోన్ చేసి మాట్లాడార‌ని అలీ అంటున్నారు. ప‌వ‌న్ సినిమా షూట్ లో భాగంగా వేరో చోట ఉండ‌టం...స‌రిగ్గా బ‌య‌ల్దేరుదాం అనుకున్న స‌మ‌యంలో ప్లైట్ మిస్ అవ్వ‌డంతో పెళ్లికి రాలేకపోతున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పిన‌ట్లు అలీ చెబుతున్నారు.

త‌ప్ప‌కుండా ఇంటికొచ్చి ప‌వ‌న్ క‌లుస్తాన‌న్నార‌ని...నూత‌న వ‌ధువరుల‌కు త‌న త‌రుపున శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. అయితే ప్లైట్ నిజంగా మిస్ అయిందా? పీకే కావాల‌నే మిస్ చేసారా? అని ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గం సందేహం వ్య‌క్తం చేస్తుంది. రాజ‌కీయంగా ఇద్ద‌రి మ‌ధ్య ఎంత దూరం పెరిగినా స్నేహితుడు కుమార్తె పెళ్లికి రాక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఆ వేడుక‌లో సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి తార‌స ప‌డితే? సీన్ ఎలా ఉంటుందో? ఊహించ‌న‌లేని ప‌రిస్థితుల నేప‌థ్యంలో పీకే మిస్ చేసి ఉండొచ్చ‌ని మరికొంత మంది భావిస్తున్నారు. కారణాలు ఏవైనా ప‌వ‌న్ లేని వెలితి పెళ్లి వేడుక‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.