Begin typing your search above and press return to search.

ద‌స‌రా గిఫ్టుందా..? పీకే ఫ్యాన్స్ కి చేదు గుళిక‌!

By:  Tupaki Desk   |   11 Oct 2021 8:30 AM GMT
ద‌స‌రా గిఫ్టుందా..? పీకే ఫ్యాన్స్ కి చేదు గుళిక‌!
X
మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. లేట్ గా వ‌చ్చిన లేటెస్ట్ గా ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకుని ప‌వ‌ర్ ఫుల్ మూవీతో ప‌వ‌ర్ ఫుల్ క‌మ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా ఓవ‌ర్సీస్ లోనూ స‌రికొత్త రికార్డుల్ని సృష్టించి క‌రోనా వేళ ప‌వ‌న్ స‌త్తాని మ‌రోసారి చాటి చెప్పింది. గ్యాప్ వ‌చ్చినా ప‌వ‌న్ మార్కెట్ లో ఎలాంటి మార్పులేద‌ని నిరూపించింది.

ఈ మూవీ ఇచ్చిన జోష్ లో ప‌వ‌ర్‌స్టార్ వ‌రుస‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయ‌క్‌` మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. రానా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈమూవీలో నిత్యామీన‌న్ ప‌వ‌న్ కు జోడీగా క‌నిపించ‌బోతోంది.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ అందిస్తున్న ఈమూవీని సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప‌వ‌న్ త‌న‌కు `గ‌బ్బ‌ర్ సింగ్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తో `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` చిత్రాన్ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని ద‌స‌రా రోజున లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి టీమ్ చ‌దు వార్త‌ని వినిపించిన‌ట్టుగా తెలుస్తోంది. ద‌స‌రాకి ముందు అనుకున్న విధంగా ఈమూవీ ఓపెనింగ్ జ‌ర‌గ‌డం లేద‌ట‌. పూజా హెగ్డే డేట్స్ ల‌భించ‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. దీంతో పీకే ఫ్యాన్స్ కొంత నిరాశ‌కు గురైన‌ట్టుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం.