Begin typing your search above and press return to search.

ఉస్తాద్ కోసం లుక్కు మార్చిన PK

By:  Tupaki Desk   |   5 April 2023 10:14 AM
ఉస్తాద్ కోసం లుక్కు మార్చిన PK
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సముద్రఖని డైరెక్షన్ లో చేస్తున్న వినోదయ సీతమ్ రీమేక్ జులై 28న రిలీజ్ కానుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలు చేయనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తన లుక్ మొత్తాన్ని మార్చారు. చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో తన రాజకీయ పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ నేడు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఫొటోలు వైరల్ గా మారాయి. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కోసం ఆయన న్యూ లుక్ లో కనిపిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కొత్త ఫొటోల్లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. గడ్డం తీసేసి చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు.

పవన్ తన కొత్త లుక్‌లో స్లిమ్‌గా మరియు ట్రిమ్‌గా కనిపిస్తూ.. దర్శనం ఇస్తున్నారు. అయితే ఇదే లుక్ లో వినోదయ సీతమ్ రీమేక్ లేదా ఉస్తాద్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఒకేసారి ఈ రెండు చిత్రాల చిత్రీకరణ జరగుతోంది. మరి ఇప్పుడు కనిపిస్తున్న న్యూ లుక్ తో ఏ సినిమాలో కనిపించబోతున్నారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి పని చేస్తారు. పవన్ కళ్యాణ్ సరసన ఏ హీరోయిన్ నటించనుందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర సాంకేతిక నిపుణుల గురించి కూడా తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.