Begin typing your search above and press return to search.

పిశాచి 2 టీజర్ : ఈ సారి ఆండ్రియా వంతు

By:  Tupaki Desk   |   29 April 2022 1:29 PM GMT
పిశాచి 2 టీజర్ : ఈ సారి ఆండ్రియా వంతు
X
విభిన్న‌మైన చిత్రాల‌తో త‌మిళంలో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడ మిస్కిన్‌. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైలి చిత్రాల‌ని రూపొందిస్తున్న మిస్కిన్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం `పిశాచి 2`. 2014లో విడుద‌లైన `పిశాచి` చిత్రానికిది సీక్వెల్. అర‌ణ్మ‌నై, అర‌ణ్మ‌నై 2 చిత్రాల్లో న‌టించిన ప్రేక్ష‌కుల్ని త‌న‌దైన న‌ట‌న‌తో భ‌య‌పెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. విజ‌య్ సేతుప‌తి, పూర్ణ, సంతోష్ ప్ర‌తాప్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిస్కిన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని రాక్ ఫోర్ట్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై టి. మురుగనాథ‌మ్ నిర్మించారు.

త‌మిళంతో పాటు ఈ మూవీని తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. తెలుగులో మాత్రం ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్ పై దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. పిశాచిగా ఆండ్రియా న‌టించిన ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం శుక్ర‌వారం టీజ‌ర్ ని త‌మిళ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోవిడుద‌ల చేశారు. ర‌క‌తం తాగే పిశాచిగా ఆండ్రియా క‌నిపిస్తున్న స‌న్నివేశాల‌తో టీజ‌ర్ మొద‌లైంది.

రెడ్ క‌ల‌ర్ థీమ్ తో అంతా చీక‌ట్లోనే రూపొందించిన ఈ మూవీలోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టించేలా వున్నాయి. టీజ‌ర్ ని పిల్ల‌లు చూడ‌కూడ‌ద‌ని ముందే తెలిపిన మిస్కిన్ పెద్ద వాళ్ల‌కే జ‌డ‌పు వ‌చ్చేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌రింయిన‌ట్టుగా టీజ‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. మిస్కిన్ టెర్రిఫిక్ విజువ‌ల్స్ కి కార్తీక్ రాజా నేప‌థ్య సంగీతం తోడై మ‌రింత భ‌యాన్ని క‌లిగిస్తోంది. గుండె వీక్ గా వున్న వాళ్లకు ఈ మూవీ టీజ‌రే నైట్ మేర్ ల మారేలా వుంది.

దుండిగ‌ల్ లోని ఫారెస్ట్ లో ఈ సినిమాని మిస్కిన్ తెర‌కెక్కించాడు. ఏడాదికి పైగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే నాలుగు భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయ‌డానికి ముందుకు రావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్ లోనే భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసిన మిస్కిన్ సినిమాతో ఏ రేంజ్ లో వ‌ణుకు పుట్టిస్తాడో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.