Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ సీక్వెల్‌ వాయిదాకు కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   28 Aug 2022 7:42 AM GMT
ఇంట్రెస్టింగ్ సీక్వెల్‌ వాయిదాకు కారణం ఇదేనా?
X
తమిళంలో తెరకెక్కి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పిసాచు ను తెలుగు లో పిసాచి అనే టైటిల్‌ తో డబ్బింగ్ చేసి విడుదల చేసిన విషయం తెల్సిందే. తమిళంతో పాటు తెలుగు లో కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. సూపర్ హిట్‌ హర్రర్‌ థ్రిల్లర్ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందిన సీక్వెల్‌ విడుదలకు సిద్ధం అయ్యింది.

నిన్న మొన్నటి వరకు సినిమాను ఆగస్టు 31 న విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు. తీరా విడుదల తేదీ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో సినిమా ను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. పిసాచు 2 సినిమా కి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా జరిగాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమా కు ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగిందట. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయం లో సంతృప్తిగా లేకపోవడంతో సినిమా వాయిదా వేశారు.

సినిమా లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కనీసం యూ/ఎ సర్టిఫికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట సెన్సార్‌ కోసం రీ అపీల్‌ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా చేరువ అవ్వాలి అంటే యూ/ఏ కావాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా సెన్సార్‌ ను మళ్లీ చేయించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశ్యంతోనే వాయిదా వేశారు అంటున్నారు.

ప్రముఖ సింగర్ కమ్‌ హీరోయిన్ అయిన ఆండ్రియా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా లో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్న నేపథ్యంలో తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా అక్కడ ఇక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనుకుంటూ ఉండగా వాయిదా పడటంతో నిరాశ వ్యక్తం అవుతోంది.

సినిమా కు ఉన్న బజ్ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రమోషన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడులో అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలను మళ్లీ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.