Begin typing your search above and press return to search.

వర్మ కొంప ముంచేసిన పైరసీప్రియులు

By:  Tupaki Desk   |   29 Jan 2018 2:00 PM IST
వర్మ కొంప ముంచేసిన పైరసీప్రియులు
X
జి.ఎస్.టి ఉరఫ్‌ గాడ్ సెక్స్ అండ్ త్రూత్. ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ చెప్పని గొప్పలు అంటూ లేవు. అమ్మాయిలకు సెక్సువల్ లిబరేషన్ కావాల్సిందే అనే కోణంలో మనోడు ఒక గొప్ప బృహత్కర ప్రయత్నం చేసినట్లు హంగామా చేశాడు. టివి ఛానళ్లలో డిబేట్లు.. కాలేజీ అమ్మాయిలతో కలసి చర్చలు.. కుర్రాళ్లతో పంచులు.. సమరం గారితో సెటైర్లు.. స్ర్తీ హక్కుల కార్యకర్తలతో గొడవలు.. వెరసి మియా మాల్కోవా నటించిన ఈ శృంగారభరిత రసాస్వాదన సినిమాకు బాగానే పాపులార్టీ వచ్చింది.

తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే.. ఆన్ లైన్లో 150 రూపాయలు టిక్కెట్టు కొని మరీ సినిమాను చూస్తే అందులో అసలు ఉన్న మ్యాటరే వేరు. ఒకమ్మాయి కెమెరా ముందు కూర్చుని.. 'నాకు నచ్చినట్లు నేను సెక్స్ చేసుకుంటా' అని చెప్పడం కోసం.. న్యూడ్ గా బెడ్ మీద దొల్లుతూ రకరకాల కొటేషన్లు ఇస్తూ.. ఓ 20 నిమిషాల పాటు ఇంటర్యూ ఇచ్చిందంతే. దానికే వర్మ చేసిన హడావుడి ఆ రేంజులో ఉంది. అయితే విషయం ఏంటంటే.. ఈ సినిమా తియ్యడానికి వర్మ ఏమన్నా ఖర్చుపెట్టాడా లేదంటే సరదాగా కానిచ్చేశాడా తెలియదు కాని.. సినిమా ఆన్ లైన్లో వచ్చిన కాసేపటికే పైరసీ ద్వారా ఇతర మాద్యమాల్లోనూ దర్శనమిచ్చింది.

తనకు పైరసీ అంటే ఇష్టం అని వర్మ ఎప్పుడూ చెబుతాడు కాబట్టి.. ఇప్పుడు దాని గురించి మాట్లాడడేమో కాని.. పైరసీప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. కనీసం వర్మకు యురోప్ వెల్ళి సినిమా తీయడానికి అయిన ఫ్లయిట్ ఖర్చులు కూడా రాకమునుపే పైరసీ బూతం ఆయన తీసిన ఈ సెక్సువల్ లిబరేషన్ కథను కబళించింది అనేది కొందరి అంచనా.