Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హౌస్ లో పింకీకి ముగ్గురు బావలట

By:  Tupaki Desk   |   6 Dec 2021 3:30 AM GMT
బిగ్ బాస్ హౌస్ లో పింకీకి ముగ్గురు బావలట
X
పింకీ ప్రయాణం బిగ్ బాస్ హౌస్ లో ముగిసింది. ట్రాన్స్ కమ్యునిటీ నుంచి వచ్చిన ఆమెకు బిగ్ బాస్ షోతో పెరిగిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోకు ముందు ఒక మోస్తరు గుర్తింపు ఉన్న ప్రియాంకకు.. ఈ షో తర్వాత వచ్చిన ఇమేజ్ కు ఏ మాత్రం సంబంధం లేదు. మానస్ - ప్రియాంక ఎపిసోడ్ ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే.. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె.. మానస్ గురించి అడిగినంతనే.. తాను మాట్లాడనని ఒకింత కఠినంగా చెప్పటం విశేషం. ఇక.. బిగ్ బాస్ ఇంట్లో పింకీ.. మానస్ మధ్య సమ్ థింగ్ అన్నట్లుగా ఉన్న విషయం మీద అందరికి అవగాహన ఉంది కానీ.. ఇంట్లో పింకీకి ముగ్గురుబావలు ఉన్న విషయాన్ని తాజాగా వెల్లడించింది.

మానస్ తో పాటు శ్రీరామ్.. జెస్సీలతో కలిపి ఇంట్లో పింకీకి ముగ్గురు బావలు ఉన్న విషయం బయటకురావటం..దానిపై స్పందించిన ప్రియాంక ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. రవి అన్నయ్య తనను ఆట పట్టించేవాడని.. మా పెద్ద బావగారు.. చిన్న బావ గారు.. బుల్లి బావగారు అనే వాడని.. అలా ఇంట్లో ముగ్గురు బావలు ఉన్నట్లుగా ప్రియాంక సైతం కన్ఫర్మ్ చేసింది.

షోలో చూపించిన కంటెంట్ ను చూసినప్పుడు.. ఈ యాంగిల్ ఎక్కడా కనిపించదు. ఎప్పుడూ.. మానస్ - ప్రియాంక ఎపిసోడ్ రన్ అయ్యేది కానీ.. ముగ్గురు బావలు ఉన్నట్లుగా చేసిన అల్లరి.. దానికి సంబంధించిన విషయాలు పెద్దగా రాలేదు. దీంతో.. ఆమె నోటి నుంచి వచ్చిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించటమే కాదు.. కొత్తగా మారాయి. ఈ లెక్కన షో చూస్తున్న జనాలకు తెలీని ఇంకెన్ని కాంబినేషన్లు తర్వాత బయటకు వస్తాయో చూడాలి.