Begin typing your search above and press return to search.

ఐక్యరాజ్య సమితిలో మెగాస్టార్ షో

By:  Tupaki Desk   |   27 Nov 2016 4:43 AM GMT
ఐక్యరాజ్య సమితిలో మెగాస్టార్ షో
X
ఓ సినిమాను ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడమే పెద్ద ఘనతగా భావించేస్తుంటారు.. ప్రచారం చేసేసుకుంటూ ఉంటారు. కానీ.. ఓ సమస్యపై రూపొందించిన మూవీని.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారంటే.. ఆ సినిమా ఎంత ఇన్ డెప్త్ గా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. అంతటి ఘనత సాధించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'పింక్'.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటించగా.. ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను 'పింక్'లో కీలక పాత్ర పోషించింది. ఆండ్రియా తరియంగ్.. కీర్తి కుల్హర్ లు తాప్సీతో పాటు కలిసి కనిపిస్తారు. ఓ తప్పుడు కేసులో ఈ ముగ్గురు అమ్మాయిలు ఇరుక్కోగా.. శిక్ష పడితే పదేళ్లకు పైగా జైలు అనుభవించాల్సి పరిస్థితిలో ఈ ముగ్గురు అమ్మాయిలపై కేసులు నమోదవుతాయి. దీంతో వీరిని ఆదుకునేందుకు తరచు మూడ్ మారిపోయే బైపోలార్ డిజార్డర్ ఉన్న రిటైర్డ్ లాయర్ అయిన అమితాబ్.. వీరిని నిర్దోషులుగా నిరూపించేందుకు ప్రయత్నిస్తాడు.

మహిళల సమస్యలపై ఇతివృత్తాన్ని ఎంచుకుని.. అంతకంటే చక్కని స్క్రీన్ ప్లే.. అద్భుతమైన నటుల ప్రతిభతో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని.. న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/