Begin typing your search above and press return to search.
షాక్: గర్భంతో యాక్షన్ సీన్ లో.. శభాష్ ఆలియా!
By: Tupaki Desk | 10 July 2022 1:27 PM ISTబాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తున్న ఆలియా భట్ తదుపరి హాలీవుడ్ లో వండర్ ఉమెన్ తో కలిసి నటిస్తుండడం సంచలనంగా మారింది. ఓవైపు రణబీర్ ని పెళ్లాడిన ఆలియా మొదటి రాత్రిని మిస్సయ్యానని.. తీవ్రంగా అలసిపోవడం వల్లనే ఇలా అయ్యిందని కాఫీ విత్ కరణ్ షోలో బాహాటంగా అంగీకరించింది. మునుపెన్నడూ లేనంతగా బిజీ నటిగా కెరీర్ ని సాగిస్తోంది. పెళ్లికి ముందు భన్సాలీతో గంగూభాయి కతియావాడీ .. రాజమౌళితో ఆర్.ఆర్.ఆర్ చిత్రాల కోసం పని చేసింది. బల్క్ కాల్షీట్లను గంగూభాయి సినిమా కోసం కేటాయించిన ఆలియా మరోవైపు రణబీర్ సరసన బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. పెళ్లి తర్వాతా ఆలియా కెరీర్ పరంగా క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.
అలియా భట్ ఇప్పుడు హాలీవుడ్ లో తన మ్యాజిక్ ను ప్రదర్శించడానికి సిద్ధమవుతోంది. తదుపరి `హార్ట్ ఆఫ్ స్టోన్` అనే భారీ చిత్రంతో హాలీవుడ్ లో అరంగేట్రం చేస్తోంది. ఇందులో ప్రముఖ ఇజ్రాయెలీ నటి `వండర్ ఉమెన్` ఫేం గాల్ గాడోట్ కూడా నటించింది. కొన్ని రోజుల క్రితం.. ఆలియా తన మొదటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. సోషల్ మీడియాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం `పోర్చుగల్`లో ఈ మూవీ చివరి రోజు షూటింగ్ నుండి ఆలియా ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.
ఈ వైరల్ ఫోటోలలో యాక్షన్ మూవీ చివరి షెడ్యూల్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆలియా సీరియస్ యాక్షన్ పాత్రలో కనిపించింది. లీకైన ఫోటోలలో ఆలియా చేతిలో తుపాకీ పట్టుకుని ఎడారి మధ్యలో షూట్ చేస్తూ కనిపించింది. యాక్షన్ క్వీన్ గల్ గాడోట్ తో కలిసి ఒక యాక్షన్ సన్నివేశంలో నటిస్తోంది. అలియా భీకరమైన యాక్షన్ అవతార్ ఆమె అభిమానులను నెటిజనులను విస్మయానికి గురి చేసింది. ఆలియా వెపన్స్ చేతపట్టి ఆర్మీ దుస్తుల్లో కనిపించడం బిగ్ సర్ ప్రైజింగ్ గా మారింది. చాలా మంది నెటిజనులు ఆమె గర్భధారణ సమయంలో యాక్షన్ సీక్వెన్స్ చేసినందుకు ప్రశంసించారు.
నిజానికి కొందరు నెటిజనులు ఈ ఫోటోలలో అలియా బేబీ బంప్ ను గుర్తించారు. ఒక అభిమాని ఆలియా ఫోటోలను షేర్ చేస్తూ.. ``ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు యాక్షన్ మూవీని షూట్ చేస్తున్నారు.. మదర్" అని సెల్యూట్ ఎమోజిని షేర్ చేసారు. లీకైన ఫోటోలను పరిశీలిస్తే.. ఆలియా పూర్తి యాక్షన్-ప్యాక్డ్ అవతార్ తో స్క్రీన్ ను మండించనుందని స్పష్టమైంది.
ఇటీవలే ఆలియా తన పార్ట్ చిత్రీకరణను ముగిస్తూ.. గాల్ గాడోట్ ను కౌగిలించుకుని ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వేరొక ఫోటోలో ఆలియా తన సిబ్బందితో కలిసి పోజులిచ్చింది. నా దర్శకుడు టామ్ హార్ప ర్ ఈ రోజు మిమ్మల్ని మిస్ అయ్యాడు .. మరియు మరపురాని అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీమ్ కి ధన్యవాదాలు. నేను అందుకున్న ప్రేమ సంరక్షణకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని ఆలియా ఎమోషనల్ అయ్యారు.
గర్భవతి అయిన అలియా ప్రస్తుతం తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి బ్రహ్మాస్త్ర విడుదల ప్రమోషన్స్ కు సిద్ధమవుతోంది. ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంతలోనే రణబీర్ నటించిన మరో భారీ చిత్రం శంషేరా ఇండియాలో అత్యంత భారీగా విడుదలవుతోంది.