Begin typing your search above and press return to search.

పిక్ టాక్: కురచ దుస్తుల్లో హాట్‌నెస్‌ తో పిచ్చెక్కిస్తోన్న సామ్..!

By:  Tupaki Desk   |   20 Jun 2022 12:00 PM GMT
పిక్ టాక్: కురచ దుస్తుల్లో హాట్‌నెస్‌ తో పిచ్చెక్కిస్తోన్న సామ్..!
X
విడాకుల ప్రకటన తర్వాత కెరీర్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టింది స్టార్ హీరోయిన్ సమంత. వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ గతంలో మాదిరిగా బిజీబిజీగా గడిపిస్తోంది. మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

ఇటీవల కాలంలో సామ్ సోషల్ మీడియా ఫీడ్ ని పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ షోతో ట్రీట్ ఇస్తోందని అర్థం అవుతుంది. ఈ మధ్య క్లోతింగ్ బ్రాండ్ షూట్ లో భాగంగా పొట్టిపొట్టి దుస్తుల్లో నెట్టింట రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో లేటెస్టుగా మరో హాట్ ఫోటో షూట్ తో వచ్చింది. సమంత ఇందులో తొడలు కనిపించేలా క్రాప్డ్ టాప్‌ ధరించి స్కిన్ షోలో కనువిందు చేసింది. కిల్లర్ ఎక్స్‌ప్రెషన్స్ ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పాలి. సామ్ టోన్డ్ ఫిజిక్‌ ను ప్రదర్శిస్తున్న ఈ ఫోటో.. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఊ అంటావా మావా అంటూ హాట్ హాట్ అందాలతో ఊపేసిన సామ్.. రాబోయే రోజుల్లో స్కిన్ షోతో మరింత ముందుకు సాగబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హద్దులు చేరిపేసిందని అంటున్నారు. రీసెంట్ ఫోటో షూట్స్ కూడా ఇవే సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'కణ్మణి రాంబో ఖతీజా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సుమంత.. 'యశోద' అనే పాన్ ఇండియా చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తోంది. ఆగష్టు 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. అలానే షూటింగ్ పూర్తి చేసుకున్న 'శాకుంతలం' మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' అనే ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది సామ్. ఇది ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుంది. ఇక 'సిటాడెల్' అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ రీమేక్ గా రూపొందే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటించనుంది. 'అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంటర్నేషన్ ప్రాజెక్ట్ కూడా సమంత చేతిలో ఉంది.
For Video : https://twitter.com/VirajVijay_/status/1538163263124406278?ref_src=twsrc^tfw|twcamp^tweetembed|twterm^1538163263124406278|twgr^|twcon^s1_c10&ref_url=https://publish.twitter.com/?query=https3A2F2Ftwitter.com2FVirajVijay_2Fstatus2F1538163263124406278widget=Tweet