Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : రెండు పదుల వయసులో మన ఆస్కార్‌ విజేత ఇలా..!

By:  Tupaki Desk   |   3 Nov 2021 4:39 AM GMT
పిక్ టాక్ : రెండు పదుల వయసులో మన ఆస్కార్‌ విజేత ఇలా..!
X
భారత సినీ పరిశ్రమ గర్వించదగ్గ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన మెలోడీస్ తో పాటు ఎన్నో అద్బుతమైన మాస్ బీట్స్.. విభిన్నమైన పాటలను అందించి ఇండియన్‌ సినిమా మ్యూజిక్ కు కొత్త రంగులు అద్దిన దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్. ఈయన ఆస్కార్‌ అవార్డును కూడా దక్కించుకుని గ్లోబల్‌ స్టార్‌ గా గుర్తింపును దక్కించుకున్నారు. సౌత్‌ సినిమాలతో ఆరంభం అయిన ఈయన జర్నీ బాలీవుడ్‌ లో స్టార్‌ గా ఎదిగి ఆ తర్వాత హాలీవుడ్ సినిమాలకు కూడా సంగీతం ను అందించే స్థాయికి చేరుకోవడం విశేషం. ఆయన నుండి మరిన్ని మంచి సినిమాలు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ వస్తాయని ఆయన అభిమానులు ఎప్పుడు ఆశిస్తూనే ఉన్నారు.

తాజాగా సోషల్‌ మీడియాలో రహమాన్ కు చెందిన ఈ ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. రహమాన్ వయసు పాతిక ఏళ్లకకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఆ సమయంలో తీసుకున్న ఈ ఫొటో నెట్టింట షేర్‌ చేశారు. రహమాన్ వింటేజ్ లుక్ కు ఆయన అభిమానులు మాత్రమే కాకుండా అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఆయన ఫేస్ లో పెద్దగా మార్పు అయితే రాలేదు కాని ఫిజిక్ మరియు స్టైల్‌ ఇంకా అప్పియరెన్స్ లో మాత్రం చాలా అంటే చాలా చాలా మార్పు వచ్చిందంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఫొటోలను చూస్తు ఉంటే నవ్వు వస్తుంది. కాని రహమాన్‌ మరీ అంత పాత సినిమాల్లో హీరోగా ఏమీ లేడు. సాదారణంగానే మంచి లుక్ తోనే ఉన్నాడు అంటూ మరి కొందరు అంటున్నారు.

సాదారణమైన చెప్పులు ధరించి.. సింపుల్ గా పాయింట్ ధరించి.. దాన్ని కాస్త పైకి కూడా మలచి.. లూజు లూజు షర్ట్‌ వేసి ఒత్తైన జుట్టుతో రహమాన్ ను ఈ ఫొటోలో చూడవచ్చు. రహమాన్ ఈ ఫొటో ఖచ్చితంగా ఒక హెరిటేజ్ అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహమాన్‌ ఆకట్టుకునే రూపం అప్పట్లోనే ఉందని.. ఇప్పటికి అదే లుక్‌ ను రహమాన్ మెయింటెన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. ఇటీవల నిర్మాతగా మారి సినిమా ను నిర్మించిన రహమాన్‌ కు నిరాశ ఎదురైంది. ఆయన నుండి మళ్లీ సినిమా లు వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.