Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : నడుము మడపై ముద్దు.. ఏంటీ ఈ అరాచకం

By:  Tupaki Desk   |   2 Feb 2022 9:30 AM GMT
పిక్ టాక్‌ : నడుము మడపై ముద్దు.. ఏంటీ ఈ అరాచకం
X
బుల్లి తెరపై ప్రస్తుతం అరియానా.. సోషల్ మీడియాలో అషు రెడ్డి చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరికి కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ స్టార్స్ గా నిలిచేలా చేసింది. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి దారుల్లో రచ్చ చేస్తూ దూసుకు పోతున్నారు. ఇద్దరు కూడా రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ముఖ్యంగా వారి ఇన్ స్టా గ్రామ్ పేజీల్లో హాట్‌ ఫొటోలను షేర్‌ చేయడం కామన్‌ విషయం అయ్యింది. కాని ఈసారి ఇద్దరు కలిసి ఒక ఫొటోలో కనిపించారు. ఆ ఫొటోను అరియానా షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది. అరియానా నడుము నాభి ఎక్స్ పోజ్ చేస్తూ ఒక అందమైన కాస్ట్యూమ్‌ ధరించి ఉంది. సన్నని నడుము.. అంతకు మించి అందమైన నాభి తో కవ్విస్తున్న అరియానాను అలా చూసి ఆగలేక ముద్దు పెట్టేసినట్లుగా ఉంది ఈ ఫోటో. అషు రెడ్డి ఆ ముద్దును అరియానా నడుము మడత పై పెట్టింది.

అషు రెడ్డి ముద్దు పెడుతున్న సమయంలో సిగ్గు పడుతున్నట్లుగా అరియానా ఫొటోకు ఫోజు ఇచ్చింది. ఈ ఫొటోను షేర్‌ చేసిన అరియానా మన ఇద్దరిని ఇలా చూసిన కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని.. మన ఇద్దరిని తప్పుడు మనుషులు గా వారు జడ్జ్‌ చేసే అవకాశం కూడా లేకపోలేదు అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. అరియానా మరియు అషు రెడ్డిలు ఇద్దరు చాలా హాట్‌ అండ్‌ బోల్డ్‌ కాస్ట్యూమ్స్ తో తాజాగా జరిగిన బిగ్ బాస్ ఉత్సవం అనే స్టార్‌ మా షో లో పాల్గొన్నారు. దాదాపు మూడు నాలుగు రోజుల పాటు ఆ షో షూటింగ్ జరిగింది. అందులో వీరిద్దరు డాన్స్ లతో పాటు స్కిట్స్‌ కూడా చేశారట. స్టార్‌ మా లో అతి త్వరలోనే ఈ షో ను టెలికాస్ట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ షో షూటింగ్ సందర్బంగా ఇలా సరదాగా అషురెడ్డి మరియు అరియానాలు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అరియానా బోల్డ్‌ అంటూ తనను తాను ప్రజెంట్ చేసుకుంటూ ఉంటుంది. అందంగానే కాకుండా బోల్డ్‌ గా కూడా కనిపిస్తూ.. తన ప్రవర్తన కూడా బోల్డ్ గా ఉంటుందని చెప్పకనే మరోసారి ఈ ఫొటోతో అరియానా చెప్పుకొచ్చింది. ఇలాంటి బోల్డ్‌ ఫొటోలు షేర్‌ చేసేందుకు ఘట్స్ కావాలి. ఆ ఘట్స్ అరియానాకు ఉన్నాయి అంటూ ఆమె అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సన్నని నడుము అందంను ఇలా ఎక్స్‌ పోజ్ చేస్తూ కుర్ర కారుకు మతులు పోగొడుతున్న అరియానా హీరోయిన్ గా ఎప్పుడు వస్తుంది అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు హీరోయిన్ గా అవకాశాలు వస్తే నటించేందుకు సిద్దం అంటూ ఆమద్య ఒక చిట్‌ చాట్‌ సందర్బంగా చెప్పుకొచ్చింది. కనుక ఫిల్మ్‌ మేకర్స్ ఈ ఫొటో చూసిన తర్వాత అయినా అరియానాకు అవకాశం ఇవ్వాలంటూ ప్రేక్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు.