Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఎంత చూసినా తనివితీరని అందాలు

By:  Tupaki Desk   |   30 Oct 2021 4:57 AM GMT
పిక్ టాక్ : ఎంత చూసినా తనివితీరని  అందాలు
X
అతిలోక సుందరి అంటూ తెలుగు ప్రేక్షకులు అందంగా పిలుచుకునే శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌. శ్రీదేవికి కేవలం తెలుగు లోనే కాకుండా తమిళం మరియు హిందీల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అలాంటి శ్రీదేవి కూతురు అంటే సహజంగానే జాన్వీ కపూర్‌ పై జనాల్లో ప్రత్యేక శ్రద్ద ఉంది. శ్రీదేవి మృతి చెందిన తర్వాత అభిమానులు జాన్వీ లో ఆమెను చూసుకుంటున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా ఇప్పటికే కొన్ని సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ను కూడా చేసింది. నటిగా సినిమా సినిమాకు మెరుగు పడుతూ వస్తోంది. కాని కమర్షియల్‌ గా ఇప్పటి వరకు మాత్రం భారీ విజయాన్ని ఈమె సొంతం చేసుకోలేక పోయింది. అయినా కూడా ఈమెకు ఆఫర్లు తక్కువేం లేవు. ప్రస్తుతం ఈమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా మరి కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

ఒక వైపు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ మరో వైపు అందాల ప్రదర్శణ విషయంలో ఆకట్టుకునే అందంతో ఇన్ స్టా గ్రామ్‌ లో హాట్ ఫొటోలను జాన్వీ కపూర్‌ షేర్ చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్‌ చేసిన పిక్స్ ను చూస్తుంటే అలాగే చూడాలనిపించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక పద్దతైన అందమైన హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ కనిపిస్తుంది. ఎంత అందం చూపిస్తే బాగుంటుంది అనే విషయాన్ని బాగా తెలిసినట్లుగా ఆమె ఒక హద్దు వరకు అందాల ప్రదర్శణ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఎంతగా చూసినా తనివితీరని ఈ హాట్ అందంకు ముందు ముందు బాలీవుడ్ బ్రహ్మరథం పట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో జాన్వీ కపూర్ ముందు రోజుల్లో స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు. ఆలియా భట్ రేంజ్ లో ఈమె ముందు ముందు బాలీవుడ్‌ సినిమాలను చేయాలని.. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు బోల్డ్‌ పాత్రలు.. కమర్షియల్‌ పాత్రలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు జాన్వీ కపూర్‌ కు అందంతో పాటు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పిక్స్ తో ఆమె తన స్థాయిని పెంచుకుంటుందని అంటున్నారు. మరీ వల్గర్ గా కాకుండా అందంగా ఆకట్టుకునే విధంగా ఉన్న జాన్వీ కపూర్‌ ను ఎంతగా చూసినా కూడా తనివి తీరడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తుంటే నిజమే అంటూ మరి కొందరు కామెంట్స్‌ లో పేర్కొంటున్నారు. వచ్చే ఏడాది జాన్వీ కపూర్‌ నటించిన రెండు లేదా మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.