Begin typing your search above and press return to search.

తమిళ బిచ్చగాడు.. పిచ్చెక్కించేశాడు

By:  Tupaki Desk   |   25 Nov 2016 11:30 AM GMT
తమిళ బిచ్చగాడు.. పిచ్చెక్కించేశాడు
X
ఈ ఏడాది ఇప్పటివరకూ పెట్టుబడితో పోల్చుకుంటే.. బిచ్చగాడు బిగ్గెస్ట్ రికార్డ్ అనే సంగతి తెలిసిందే. బుల్లితెరపై ప్రదర్శితమైనపుడు కూడా ఈ ఏడాది అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకున్నాడు. తెలుగు వెర్షన్ బిచ్చగాడికి 18.75 పాయింట్ల రేటింగ్ వచ్చింది.

ఈ ఏడాది స్టార్ హీరోలు కూడా ఇన్నేసి పాయింట్లు సాధించలేకపోవడంతో ఇదే పెద్ద రికార్డ్ అనుకుంటే.. ఇప్పుడు తమిళ్ వెర్షన్ పిచ్చైక్కారన్ అయితే.. పిచ్చెక్కించే రేంజ్ లో టీఆర్పీ సాధించింది. నవంబర్ 13న సన్ టీవీలో పిచ్చైక్కారన్ టెలికాస్ట్ కాగా.. ఏకంగా 24.55 పాయింట్ల టీఆర్పీ సొంతం చేసుకుంది. సౌతిండియా మొత్తంలో ఇదే ఇప్పటివరకూ బిగ్గెస్ట్ రికార్డ్. సాధారణంగా తెలుగు సినిమాల కంటే తమిళ్ మూవీస్ కి రేటింగ్ తక్కువగా ఉంటుంది. కానీ పిచ్చైక్కారన్ మాత్రం వాటన్నిటినీ తుడిచిపెట్టేసింది. నాగార్జున శ్రీరామదాసు(24), మగధీర (22), బాహుబలి (21.84), శ్రీమంతుడు (21.24) రేటింగ్ పాయింట్లు సాధించాయి. ఇవన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అనే సంగతి తెలిసిందే.

స్టార్స్ లేకపోయినా అదే రేంజ్ లో విజయం సాధించింది ఈ విజయ్ ఆంటోనీ మూవీ. తమిళ్ లో ఈ మూవీకి 45 కోట్ల వసూళ్లు రాగా.. తెలుగులో 25 కోట్లు కొల్లగొట్టి.. బిచ్చగాడు కోటీశ్వరుడు అయిపోయాడు. ఒకే సినిమా రెండు భాషల్లో హైయెస్ట్ టీఆర్పీలను సాధించడం.. బహుశా బిచ్చగాడికే మొదటిసారిగా సాధ్యమైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/