Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఈ తెలుగమ్మాయిల కష్టం ఫలించేనా?

By:  Tupaki Desk   |   14 July 2021 3:50 AM GMT
పిక్ టాక్ : ఈ తెలుగమ్మాయిల కష్టం ఫలించేనా?
X
టాలీవుడ్ లో మెజార్టీ హీరోయిన్స్ ఇతర భాషలకు చెందిన హీరోయిన్స్‌ రాజ్యం ఏళుతున్నారు. ఒకానొక సమయంలో తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్‌ లో అస్సలు ఆఫర్లు దక్కేవి కావు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్ల మెల్లగా మారుతున్నాయి. టాలీవుడ్ లో ఈషా రెబ్బా.. ప్రియాంక జవల్కర్‌.. శివాత్మిక రాజశేఖర్‌ ఇంకా కొందరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌ గా సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలకు స్టార్‌ హీరోల నుండి ప్రోత్సాహం అస్సలు ఉండదు అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. అందుకే చిన్న హీరోలతో చిన్న సినిమాలను చేస్తూ వీరు ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈషా రెబ్బ తెలుగు అమ్మాయి అయినా కూడా ముంబాయి ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందాలను ఆరబోస్తూ ఉంటుంది.

ఈషాను తెలుగు లో ముందు ముందు పెద్ద సినిమాల్లో చూస్తామనే ఆశను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న జీవిత రాజశేఖర్‌ ల ముద్దుల కూతురు శివాత్మిక కూడా ముందు ముందు మంచి సినిమాల్లో నటిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. టాలీవుడ్‌ లో ఇక ముందు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న తెలుగు అమ్మాయిలకు వీరిద్దరు ఆదర్శంగా నిలుస్తారనిపిస్తుంది. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ పర భాష హీరోయిన్స్ ఇస్తున్న గట్టి పోటీని తట్టుకుని నిలబడుతున్నారు. వీరిద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులు. పార్టీలకు వేడుకలకు కలిసి హాజరు అవుతూ అందరి దృష్టిని ఆకర్షించే శివాత్మిక మరియు ఈషా లు రెగ్యులర్‌ గా జిమ్ లో కలిసి వర్కౌట్స్ చేస్తారట.

హీరోయిన్స్ అంటే ఫిజిక్ ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒక మోస్తరు కంటే ఎక్కువ బరువు ఉంటే ప్రేక్షకులు ఏ భాష వారు అయినా కూడా తిరష్కరిస్తారు. కనుక తెలుగు అమ్మాయిలు అయిన వీరిద్దరు తమ ఫిజిక్ ను కాపాడుకునేందుకు చమటోడుస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ గా నిలదొక్కకునేందుకు వీరు జిమ్‌ లో వర్కౌట్స్ తో పాటు డాన్స్ ప్రాక్టీస్ లు చేస్తూ ఎప్పుడు బిజీ బిజీగా నే ఈ ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. హీరోయిన్స్ గా వీరు ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. శివాత్మిక క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అది కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం స్టార్‌ హీరోలు తెలుగు అమ్మాయిల వైపు చూడటం లేదు. కాని భవిష్యత్తులో వారు కూడా తెలుగు అమ్మాయిలతో రొమాన్స్‌ కు సిద్దం అవుతారని.. అప్పుడు వీరి దారిలో మరింత మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో అడుగు పెడతారని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివాత్మిక తరహాలోనే శివాని కూడా హీరోయిన్‌ గా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం శివాని రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈషా కు శివాని కూడా మంచి స్నేహితురాలు. వీరు ముగ్గురు రెగ్యులర్‌ గా వర్కౌట్స్ చేస్తూ పార్టీలకు రెస్టారెంట్‌ లకు తిరుగుతూ ఉంటారు. ఈ ముగ్గురు స్నేహితురాళ్లు హీరోయిన్స్ గా సక్సెస్‌ అయ్యి టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా స్టార్స్ గా ఎదిగే రోజులు తీసుకు రావాలని కొందరు ఆశ పడుతున్నారు. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.