Begin typing your search above and press return to search.

కొరకొర చూపులతో వేడి పుట్టిస్తున్న యాంకరమ్మ..!

By:  Tupaki Desk   |   14 Nov 2022 1:30 PM GMT
కొరకొర చూపులతో వేడి పుట్టిస్తున్న యాంకరమ్మ..!
X
బుల్లితెరపై రాణిస్తున్న టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. సుమ కనకాల.. ఉదయ భాను.. అనసూయ భరద్వాజ్.. రష్మి.. వర్షిణి.. విష్ణు ప్రియ.. శ్యామల తదితరులు యాంకరింగ్ తోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వీరిలో కొందరు బుల్లితెరపై రాణిస్తూనే సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బుల్లితెర రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి సైతం యాంకరింగ్ తోనే భారీ క్రేజ్ దక్కించుకుంది. వరుసగా టీవీ షోలకు యాంకరింగ్ చేస్తున్న సమయంలోనే బిగ్ బాస్-3లో ఆఫర్ దక్కించుకుంది. ఈ సీజన్లో రన్నర్ గా నిలిచి శ్రీముఖి సత్తా చాటింది. యాంకర్ గానే కాకుండా అవకాశం అన్నప్పుడల్లా శ్రీముఖి పలు సినిమాల్లో మెరుస్తోంది.

బొద్దుగా ఉండే ఈ భామ గ్లామర్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండే శ్రీముఖి హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వింటర్లోనూ హీట్ పుట్టిస్తోంది. దీంతో ఆమెకు సంబంధించిన ఫొటోలన్నీ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య సైతం భారీగా పెరిగిపోతోంది.

శ్రీముఖి తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేయగా అవికాస్తా వైరల్ గా మారుతున్నాయి. ఎర్రటి చందేరీ కుర్తా సహారా సెట్ ధరించిన శ్రీముఖి ఆకర్షణీయంగా కన్పిస్తోంది. దీనికితోడు కొరకొర చూపులతో కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది. లైట్ మేకప్.. లూస్ హేర్.. మెడలో ధగధగ మెరిసే నెక్లెస్ తో శ్రీముఖి మెరిసిపోతుంది.

జాకెట్ ఓపెన్ చేసినట్లుగా ఉన్నటువంటి ఎర్రటి చందేరీ కుర్తాలో శ్రీముఖి భారీ అందాలను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనేలా ఉన్నాయి ఆ ఫోటోలు. ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘బోళా శంకర్’ మూవీలో నటిస్తోంది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ మూవీలో శ్రీముఖి పాత్రను స్పెషల్ డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.