Begin typing your search above and press return to search.

శ్రీముఖి క్లిక్...సూపర్ హాట్!

By:  Tupaki Desk   |   4 Nov 2022 4:30 PM GMT
శ్రీముఖి క్లిక్...సూపర్ హాట్!
X
శ్రీముఖి సూప‌ర్ హాట్ సెన్షేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న తెర‌పై ఎలాంటి కాపిటీష‌న్ ఉన్నా రాముల‌మ్మ ప్ర‌త్యేక‌త వేరు. స‌మ్ థింగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అమ్మ‌డి సొంతం. త‌న‌లో ఆ రేర్ క్వాలిటీనే మిగ‌తా వాళ్ల నుంచి వేరు చేస్తుంది. సరైనా సినిమా ఛాన్సులు ప‌డ‌లేదు..లేదంటే అక్క‌డా చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగేది.

అయినా అంది వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. త‌న లో హాట్ అప్పిరియ‌న్స్ ని సంద‌ర్భం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవ‌లే పింక్ డిజైన‌ర్ లో పిచ్చెక్కించిన అమ్మ‌డు మ‌రోసారి సెగ‌లు పుట్టించే ఫోటోతో ముందుకొచ్చేసింది. స్లీవ్ లెస్ దుస్తుల్లో అగ్గి రాజేసే అందాల‌తో ఆక‌ట్టుకుంటోన్న ఫోటో ఒక‌టి నెట్టింట దుమారం రేపుతోంది. డిజైన‌ర్ స్లీవ్ లెస్..మ్యాచింగ్ చెవి దిద్దులు క్లీవేజ్ షో స‌హా అమ్మ‌డి ఐ అందాలు హైలైట్.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలి కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. బుల్లి తెర‌పైనా సొగ‌స‌రి డిజైన‌ర్ దుస్తుల్లో మురుపిస్తోన్న వైనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీముఖి ఏ షో చేసినా ఆ షోలో అందాల ప్ర‌ద‌ర్శ‌న హైలైట్ అవ్వాల్సిందే. కాంపిటీష‌న్ పెరుగుతోన్న నేప‌థ్యంలో బ్యూటీ మ‌రింత అందంగా క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డుతుంది.

రేర్ గా సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. అడ‌పా ద‌డ‌పా చిన్న చిత‌కా సినిమాల్లో మెయిన్ లీడ్స్ లో నూ న‌టిస్తుంది. సీనియ‌ర్ యాంక‌ర్లు మ‌ధ్య‌లో ఎగ్జిట్ అయితే ఆ స్థానం శ్రీముఖి భ‌ర్తీ చేస్తుంది. స్టార్స్ ఇంట‌ర్వ్యూల్లోనూ చ‌లాకీత‌నం ప్రద‌ర్శిస్తుంది. చిరంజీవి..బాల‌య్య‌..వెంకీ లాంటి సినియ‌ర్ హీరోల‌తో అమ్మ‌డి చిట్ చాట్ లు ఇంట్రెస్టింగ్. న‌వ‌త‌రం క‌థానాయకుల‌తో అమ్మ‌డి ర్యాపో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్లు సుమ‌..ఝాన్సీ లాంటి వారు దూర‌మ‌వుతుండ‌టంతో ఆ స్థానాన్ని భ‌ర్తీ చేసే రేసులో క‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.