Begin typing your search above and press return to search.

వైట్ ఫ్రాకులో సోనాల్ సెల్ఫీ వైర‌ల్

By:  Tupaki Desk   |   28 April 2021 1:04 PM GMT
వైట్ ఫ్రాకులో సోనాల్ సెల్ఫీ వైర‌ల్
X
బాలకృష్ణ స‌ర‌స‌న లెజెండ్- డిక్టేటర్ -రూలర్ వంటి చిత్రాలలో నటించిన సోనాల్ చౌహాన్ ఆ త‌ర్వాత ఆశించిన ఆఫ‌ర్లు అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మోడ‌లింగ్ వృత్తిని కొన‌సాగిస్తూ హాట్ ఫోటోషూట్లతో హెడ్ లైన్స్ లోకి వ‌స్తోంది. తాజాగా తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాల్లో పంచుకుంది సోనాల్. సోనాల్ తన ఇంట్లో తీసిన అందమైన సెల్ఫీ ఇది.

ఈ ఫోటోగ్రాఫ్ లో మోకాళ్ల వరకు ఉన్న వైట్ ఫ్రాక్ లో క‌నిపించింది సోనాల్. ఈ ఫోటో త‌న‌ అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ అని చెప్పాలి. ``ఇంట్లో ఉండండి… సురక్షితంగా ఉండండి`` అన్న వ్యాఖ్య‌ను జోడించింది.

చివరిసారిగా 2019 చిత్రం రూలర్ లో కనిపించిన సోనాల్ ప్రస్తుతం హిందీలో కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మునుముందు వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించేందుకు ఆస‌క్తిగా ఉందీ బ్యూటీ.