Begin typing your search above and press return to search.

పిక్ టాక్ః అల‌ల‌పై ఊయ‌లూగుతున్న సోయ‌గం..!

By:  Tupaki Desk   |   19 Feb 2021 12:30 PM GMT
పిక్ టాక్ః అల‌ల‌పై ఊయ‌లూగుతున్న సోయ‌గం..!
X
‘ర‌కుల్ ప్రీత్ సింగ్..’ ఈ అమ్మడు ఫిట్నెస్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయితే.. బ్యూటీకి కేరాఫ్! ఈ రెండు అసెట్స్ ను ఈక్వ‌ల్ గా మెయింటెయిన్ చేస్తున్న ర‌కుల్‌.. ఆన్ స్క్రీన్ మాత్ర‌మే కాదు, ఆఫ్ స్క్రీన్లోనూ రెచ్చిపోతూ ఉంటుంది. ఫ్రీ టైం క్రియేట్ చేసుకొని మ‌రీ.. ఫ్యాన్స్ కు అందాల విందులు ఇస్తూ ఉంటుంది.

లేటెస్ట్ గా బీచ్ బికినీ ట్రీట్ తో రెచ్చిపోయింది ర‌కుల్‌. ఏకంగా స‌ముద్రంలోనే ఊయ‌ల క‌ట్టేసి.. అల‌ల‌పై ఊయ‌ల ఊగుతోందీ భామ‌. ఆ నీళ్లు చ‌ల్ల‌గా త‌గులుతున్నాయేమో.. బిగ్గ‌ర‌గా న‌వ్వేస్తూ సంద‌డి చేసింది. చ‌లువు క‌ళ్ల‌ద్దాల‌తో.. టూ పీస్ బికినీలో ఫొటోకు ఫోజిచ్చిన ర‌కుల్ అందాల‌ను చూసి.. ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ట్విట‌ర్ లో త‌న స‌ముద్ర‌పు అందాల‌ను పోస్ట్ చేసిన ర‌కుల్‌.. దానికో అంద‌మైన క్యాప్ష‌న్ కూడా రాసుకొచ్చింది. న‌వ్వుతూ ఉండ‌డ‌మే త‌న డైలీ థెర‌పీ అని రాసుకొచ్చిన ర‌కుల్‌.. జీవితంలో లాఫింగ్ ఎంత ఇంపార్టెంటో చెబుతోంది. అందం.. ఆనందం.. క‌లిసిన ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.