Begin typing your search above and press return to search.

పిక్ టాక్: రకుల్ ఆనంద ‘యోగం’..

By:  Tupaki Desk   |   20 Dec 2020 9:45 AM GMT
పిక్ టాక్: రకుల్ ఆనంద ‘యోగం’..
X
తెలుగులో టాప్ హీరోయిన్ లిస్టులో ఉంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆన్ స్క్రీన్ లో తన లుక్ తో కుర్రకారు మతి పోగొడుతుంది ఈ చిన్నది. అయితే.. ఆ స్ట్రక్చర్ ఊరికే వచ్చింది కాదు. దేవుడిచ్చిన అందాన్ని, సౌష్టవాన్ని.. ఇలా కష్టపడి కాపాడుకుంటోంది ఈ చిన్నది. ఫిట్ నెస్ కాపాడుకోవడంలో తనకు తానే సాటి అన్నట్టుగా.. నిత్యం కఠినమైన వర్కవుట్లు చేసే ఈ భామ.. ప్రశాంతంత కోసం ఇలా యోగాసనాలు కూడా వేస్తుంది. మాల్దీవుల టూర్ లో తాను యోగా చేస్తున్నప్పుడు క్లిక్ మనిపించిన స్టిల్ ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రకుల్. బీచ్ ఒడ్డున ఉన్న ఆమె హట్ వద్ద రకుల్ వేసిన ఆసనం అందరినీ ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘చెక్’ మూవీలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా.. క్రిష్ రాబోయే ప్రాజెక్టులోనూ ఛాన్స్ దక్కించుకుంది. అదేవిధంగా.. అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘మే డే’లోనూ ఈ పంజాబీ భామ నటిస్తోంది. ప్రస్తుతం ఈ షూట్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది.