Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : పవన్‌ ఫ్యాన్స్‌ ను ఆ రోజుల్లోకి తీసుకు వెళ్లిన పీసీ శ్రీరామ్‌

By:  Tupaki Desk   |   13 Jun 2021 12:30 PM GMT
పిక్ టాక్‌ : పవన్‌ ఫ్యాన్స్‌ ను ఆ రోజుల్లోకి తీసుకు వెళ్లిన పీసీ శ్రీరామ్‌
X
ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్ పవన్ అభిమానులను సర్‌ ప్రైజ్‌ చేశాడు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఫొటోను నెట్టింట షేర్‌ చేశాడు. ఖుషి సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ ఫొటో లో పవన్ మరియు భూమిక ఉన్నారు. ఖుషి సినిమాలోని ఒక పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఫొటో తీసినట్లుగా తెలుస్తోంది. పవన్ మరియు భూమిక లు బైక్‌ పై అలా రయ్యిమంటూ వెళ్తున్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు. లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్ అయిన పీసీ శ్రీరామ్ అంటే పవన్ కు ప్రత్యేకమైన అభిమానం అనడంలో సందేహం లేదు. ఇద్దరు కలిసి పలు సందర్బాల్లో వర్క్‌ చేయడం జరిగింది. భావోద్వేగ సన్నివేశాలతో పాటు ఏ రకం సన్నివేశం అయినా అద్బుతంగా వెండి తెరపై తన కెమెరా తో చూపించగల సత్తా ఉన్న సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌.

ఖుషి సినిమాలో పీసీ శ్రీరామ్‌ కెమెరా వర్క్‌ కు ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి అనడంలో సందేహం లేదు. సింపుల్‌ షాట్స్ తో మన ముందు ఏదో కథ నడుస్తున్నట్లుగా సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చేశాడు. సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంలో ఖచ్చితంగా పీసీ శ్రీరామ్‌ భాగస్వామ్యం ఉందనే అభిప్రాయం ఉంది.