Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : ఇస్మార్ట్‌ బ్యూటీ సూపర్‌ హాట్ ఫోజ్‌

By:  Tupaki Desk   |   28 Dec 2021 5:42 AM GMT
పిక్‌ టాక్ : ఇస్మార్ట్‌ బ్యూటీ సూపర్‌ హాట్ ఫోజ్‌
X
కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్‌ తెలుగు సినిమా లతో స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది. కన్నడంలో మూడు సినిమాల్లో నటించిన నభా నటేష్‌ తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమాతో నటిగా మంచి పేరు దక్కించుకోవడం మాత్రమే కాకుండా అందాలతో అదరగొట్టేసింది. మొదటి సినిమా లో స్కిన్ షో చేసే అవకాశం రాకున్నా కూడా ఆ తర్వాత తర్వాత ఆమె సినిమాల్లో మరియు సోషల్ మీడియాలో విచ్చల విడిగా స్కిన్‌ షో చేసి ఆహా ఓహో అనిపించుకుంది. మరోసారి ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఇలా అందాల ప్రదర్శణ చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి షేర్‌ చేసింది.

తెలుగు లో ప్రస్తుతం ఈ అమ్మడి క్రేజ్‌ భారీగానే ఉంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు స్టార్‌ హీరోలకు సైతం మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా ఈ అమ్మడికి బిగ్‌ టర్నింగ్‌ పాయింట్‌ గా చెప్పుకోవచ్చు. సినిమా లతో బిజీ అవ్వడానికి ఈ అమ్మడికి ఇస్మార్ట్‌ శంకర్ చాలా ఉపయోగపడింది అనడంలో కూడా సందేహం లేదు. మొత్తానికి నభా నటేష్ ఆకట్టుకునే అందంతో పాటు మంచి ప్రతిభతో ప్రేక్షకులను అలరిస్తూ టాప్ స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అందుకు గాను ఇలా హాట్‌ ఫొటోలను రెగ్యులర్ గా షేర్‌ చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇలా బ్లూ జీన్స్ లో నడుము అందాలను చూపిస్తూ.. ఎద సౌందర్యంను చూపించి చూపించకుండా ఊరిస్తూ ఆకట్టుకుంది. ఈమె అందాలను స్టార్ హీరోలు ఎందుకు గుర్తించడం లేదు.. ఈమెకు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో అయినా నభా నటేష్ కు స్టార్స్ నుండి పిలుపు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా లో అందాల ఆరబోతతో స్టార్స్ ను మరియు ఫిల్మ్‌ మేకర్స్ ను ఈ అమ్మడు మెప్పించేనో చూడాలి.