Begin typing your search above and press return to search.

పిక్ టాక్: టార్గెట్ వైపు దూసుకొస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'

By:  Tupaki Desk   |   7 Sep 2021 5:43 AM GMT
పిక్ టాక్: టార్గెట్ వైపు దూసుకొస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
X
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్''. 'మిస్టర్ మజ్ను' తర్వాత అఖిల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. యూత్ ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అఖిల్ కు జోడీగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే నటిస్తోంది.

అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని జూన్ 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తదుపరి డేట్ కోసం వేచి చూసిన మేకర్స్.. ఇప్పుడు అఖిల్ ను దసరా బరిలో నిలుపుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే 'మనసా మనసా' 'గుచ్చే గులాబీ' 'ఏ జిందగీ' పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా అఖిల్ వచ్చే నెల 8న థియేటర్లలోకి రాబోతున్నాడని చెబుతూ సరికొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

హైదరాబాద్ - యూఎస్ఏ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ పోస్టర్ లో అఖిల్ విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. కొన్నిట్లో ఫార్మల్ డ్రెస్ లో మరికొన్నిట్లో ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అక్కినేని అందగాడు ఆకట్టుకుంటున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' నుంచి ఎగ్జైటింగ్ అప్డేట్స్ - ప్రమోషనల్ కార్యక్రమాలను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్లు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ - వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్.. తన 4వ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. మరి విజయదశమి యూత్ కింగ్ కు ఎలాంటి విజయాన్ని