Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : 'మహర్షి' బ్యూటీ రివీల్‌

By:  Tupaki Desk   |   3 Feb 2019 4:29 PM GMT
పిక్‌ టాక్‌ : మహర్షి బ్యూటీ రివీల్‌
X
మహేష్‌ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న 25వ చిత్రం 'మహర్షి' షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలోనే షూటింగ్‌ ను ముగించేందుకు వంశీ పైడిపల్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏప్రిల్‌ చివరి వారంలో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహేష్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన హీరోయిన్‌ స్టిల్స్‌ ఇప్పటి వరకు రివీల్‌ రాలేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు రెండు మూడు మహేష్‌ బాబు స్టిల్స్‌ ను మాత్రం విడుదల చేశారు కాని, హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ చిత్రంలో ఎలా ఉంటుందనే విషయంపై యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మెల్లగా సినిమాలోని పాత్రలను రివీల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు. మహేష్‌ బాబు, పూజా హెగ్డేల రొమాంటిక్‌ స్టిల్‌ ను విడుదల చేశారు. మహేష్‌ బాబు కౌగిట్లో ఒదిగి పోయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే చాలా క్యూట్‌ గా ఉంది. అరవింద సమేత చిత్రంలో ఎలా అయితే కనిపించిందో ఈ చిత్రంలో కూడా దాదాపుగా అదే మేకోవర్‌ తో కనిపించబోతుంది. అయితే మహేష్‌ బాబు మాత్రం కాస్త గడ్డం, మీసాలతో కొత్తగా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రం కోసం పూజా హెగ్డే ఏకంగా 1.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మహర్షి కోసం బల్క్‌ గా డేట్లను పూజా హెగ్డే ఇచ్చిందని, మహేష్‌ బాబు మూవీ కోసం ఈమె ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తన క్రేజ్‌ ఇంకా పెరుగుతుందనే నమ్మకంతో పూజా హెగ్డే ఉంది.