Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : మహేష్‌.. నమ్రత అన్యోన్యతకు సాక్ష్యం

By:  Tupaki Desk   |   1 Aug 2022 8:48 AM GMT
పిక్ టాక్‌ : మహేష్‌.. నమ్రత అన్యోన్యతకు సాక్ష్యం
X
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు నిలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి చెందిన కపుల్స్ విడిపోయిన ఘటనలు ఉన్నాయి. విడిపోయిన వారు.. విడిపోవాలి అనే ఆలోచన ఉన్న వారు మహేష్ బాబు మరియు నమ్రత ను చూసి నేర్చుకోవాలి అంటూ సూపర్‌ ఫ్యాన్స్‌ ఈ ఫోటోకు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు.

నమ్రత ఈ ఫోటోను షేర్‌ చేసింది. సందర్భం ఏదైనా.. అది ఎక్కడైనా నీ కంటే ఎక్కువేం కాదు అన్నట్లుగా నమ్రత ఈ ఫోటోను షేర్‌ చేయడంతో ఇద్దరి మధ్య ఏ స్థాయి అన్యోన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో మహేష్ బాబు మరియు నమ్రత ల గురించి ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. వారి జంటను అభిమానించే వారు ఎంతో మంది ఉంటారు.

ఇతర హీరోల అభిమానులు కూడా వారి జోడీని ఇష్టపడుతారు అనడంలో సందేహం లేదు. అలాంటి నమ్రత మరియు మహేష్ లు ఎప్పటికప్పుడు తమ జంట కు ఉన్న అభిమానుల సంఖ్య పెంచుకునేలా ఇలాంటి ఫోటోలను షేర్‌ చేస్తూనే ఉన్నారు.

ఒక ఓపెన్‌ ప్లేస్‌ లో ఇలా మహేష్ బాబు చిన్న పిల్లాడిగా నమ్రతను హగ్‌ చేసుకోవడం చూస్తే.. ఆమె మహేష్‌ ను ఎంతగా చూసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.

మహేష్‌ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా మంచి వసూళ్లను రాబట్టినట్లుగా నిర్మాతల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ తో సినిమా ను చేసేందుకు గాను మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.

ఇటీవలే ఆగస్టు లో సినిమా ను పట్టాలెక్కించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. మొన్నటి వరకు విదేశాల్లో ఉన్న మహేష్ బాబు షూటింగ్ కు సంబంధించిన వర్కౌట్ లను మొదలు పెట్టాడని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిన త్రివిక్రమ్‌ మూవీ మరి కొన్ని రోజుల్లో పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడు