Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్ లుక్ తో చంపేస్తున్న సామ్‌

By:  Tupaki Desk   |   16 Dec 2021 2:30 AM GMT
పిక్ టాక్ : క్యూట్ లుక్ తో చంపేస్తున్న సామ్‌
X
సోషల్‌ మీడియాలో సమంత జోరు కొనసాగుతోంది. ఆమె రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూనే ఉంది. ఈమద్య కాలంలో ఆమె హాట్‌ ఫొటో షూట్‌ తో పాటు బ్రాండ్ ప్రమోటింగ్ స్టిల్స్ ను కూడా షేర్‌ చేస్తుంది. తాజాగా ఈఅమ్మడు ఒక జ్యువెలరీ కి చెందిన సంస్థ బ్రాండ్‌ ను ప్రమోట్‌ చేయడం కోసం ఈ ఫొటోలను షేర్‌ చేసింది. బ్రాండ్‌ ప్రమోట్‌ చేసేందుకు షేర్‌ చేసిన ఫొటోల్లో కూడా సమంత గ్లామర్ అదిరి పోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. చాలా క్యూట్‌ గా ఉన్న సమంత సింపుల్‌ గా ఆ లుక్స్ తో చంపేస్తుంది అన్నట్లుగా నెటిజన్స్ ఆమె ఫొటోలకు తెగ కామెంట్స్ పెడుతున్నారు. సమంత భారీ మొత్తంలో ఈ బ్రాండ్ పోస్ట్ ను షేర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.

సమంత ఏ కాస్ట్యూమ్‌ లో అయినా కూడా అద్బుతం అన్నట్లుగా ఉంటుందని.. హాట్.. క్యూట్‌.. సెక్సీ ఇలా ప్రతి ఒక్క ఔట్ ఫిట్ లో అదరి పోతుందనే కామెంట్స్ దక్కించుకుంటుంది. ఇటీవల కాలంలో సమంత కాస్త హద్దులు దాటినట్లుగానే అనిపిస్తుంది. అక్కినేని వారి కోడలిగా ఉన్న సమయంలో తనకు తాను కొన్ని కండీషన్స్ పెట్టుకుని.. తనను తాను ఒక చట్రంలో పెట్టుకున్న సమంత ఇప్పుడు దానిలో నుండి బయటకు వచ్చి తన అభిరుచికి తగ్గట్లుగా ఉంటుంది. ఈ విషయంలో ఆమెను అభినందించే వారు ఉన్నారు.. విమర్శించే వారు లేకపోలేదు. ఒక ఇంటి కోడలు.. అది కూడా ఒక హీరో భార్య అయినప్పుడు పద్దతిగా ఉండాల్సిందే. ఇప్పుడు తను సింగిల్ కనుక తన ఇంట్రెస్ట్‌ ప్రకారం ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగు లో ఈమె శాకుంతలం చేసింది. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఆ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. శాకుంతలం సినిమా విడుదలకు ముందే పుష్ప సినిమా లోని ఐటెం సాంగ్ తో సమంత రాబోతుంది. ఈనెల 17న విడుదల కాబోతున్న పుష్ప సినిమా కు బూస్టింగ్‌ ఇచ్చినట్లుగా సమంత ఐటెం సాంగ్‌ వచ్చిందని అంటున్నారు. మరో వైపు ఈమె హిందీలో కూడా సినిమా చేయబోతుంది. తమిళంలో ఈమె నటించిన సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.