Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కిల్ల‌ర్ ఫోజుల‌తో కాక‌లు పుట్టిస్తోంది

By:  Tupaki Desk   |   11 April 2021 10:30 AM GMT
ఫోటో స్టోరి: కిల్ల‌ర్ ఫోజుల‌తో కాక‌లు పుట్టిస్తోంది
X
అందాల ఎలివేష‌న్ లో నేటిత‌రం నాయిక‌ల స్పీడ్ గురించి తెలిసిన‌దే. మోడ్రన్ డేస్ క‌థానాయిక‌ల్లో కియ‌రా అద్వాణీ గ్లామ‌ర్ క్వీన్ గా వెలిగిపోతోంది. టాలీవుడ్ లో భ‌ర‌త్ అనే నేను- విన‌య విధేయ రామా చిత్రాల్లో క‌నిపించిన కియ‌రాకి ఆ త‌ర్వాత కియ‌రాకి ఏమాత్రం సంబంధ‌మే లేదు. గ్లామ‌రస్ పాత్ర‌ల‌తో బాలీవుడ్ లో చెల‌రేగిపోతోంది.

ఇటీవ‌ల కుర్ర‌హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో డీప్ గా ప్రేమాయ‌ణం సాగిస్తోంద‌న్న ప్ర‌చారం సాగింది. కానీ దానిపై కియ‌రా కానీ సిద్ధార్థ్ కానీ స్పందించ‌నే లేదు. ఇక నిరంత‌రం కియ‌రా ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్లతో అభిమానుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తోంది. తాజాగా కియ‌రా అల్ట్రా బోల్డ్ లుక్ ని షేర్ చేయ‌గా అది అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది. ఈ భామ అంత‌కంత‌కు హీటెక్కించే కంటెంట్ పెంచేస్తోందంటూ అభిమానులు ఘాటైన వ్యాఖ్య‌ల్ని షేర్ చేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కియారాను చివరిసారిగా ‘ఇందూ కి జవానీ’ లో ఆదిత్య సీల్ తో క‌లిసి కనిపించారు. ఆమె తదుపరి సిధార్థ్ తో ‘షెర్షా’ లో కనిపిస్తుంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల కానుంది. వరుణ్ ధావన్- అనిల్ కపూర్- నీతు కపూర్ లతో ఆమె ‘జగ్ జగ్ జీయో’లోనూ న‌టిస్తోంది. భూల్ భులయ్యా చిత్రంలోనూ కియ‌రా న‌టిస్తోంది.