Begin typing your search above and press return to search.

ఎల్లో బికినీలో అగ్గి రాజేసిన కియరా అద్వాణీ

By:  Tupaki Desk   |   4 July 2021 8:30 AM GMT
ఎల్లో బికినీలో అగ్గి రాజేసిన కియరా అద్వాణీ
X
బాలీవుడ్ లో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉంది కియ‌రా అద్వాణీ. ఓవైపు హిందీ చిత్ర‌సీమ‌ను ఏల్తూనే ఇటు సౌత్ పైనా ఈ బ్యూటీ దృష్టి సారించింది. త‌దుప‌రి ఎన్టీఆర్ - కొర‌టాల చిత్రంలోనూ క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు కియ‌రా సీక్రెట్ ప్రేమాయ‌ణం పైనా బాలీవుడ్ లో ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కుముందే 2021 జ‌న‌వ‌రిలో నూత‌న సంవ‌త్స‌ర సెలబ్రేష‌న్స్ కోసం ప్రియుడు సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి సీక్రెట్ గా మాల్దీవుల‌కు వెళ్ల‌డం వేడెక్కించింది. మాల్దీవుల విహారం నుంచి ర‌క‌ర‌కాల బికినీ ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తూ కియ‌రా అగ్గి రాజేసింది.

తాజాగా మ‌రో హాట్ బికినీ ఫోటోని ఇన్‌ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఈసారి ప‌సుపు బికినీలో కియ‌రా యాబ్స్ ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని ఒణికిస్తోంది. ప‌ర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీతో కియ‌రా మునుప‌టి కంటే హాట్ గా క‌నిపిస్తోంది. డియ‌ర్ బికినీ బాడీ ప్లీజ్ కంబ్యాక్ అంటూ క్యాప్ష‌న్ ని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఇది బీచ్ వెకేష‌న్ నుంచి త్రోబ్యాక్ ఫోటోషూట్ అని అర్థ‌మ‌వుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కియారా అద్వానీ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. మ‌ల్హోత్రా స‌ర‌స‌న న‌టించిన‌ షేర్షా విడుదలకు సిద్ధమవుతోంది. ఆ తర్వాత భూల్ భూల‌యా -2... జగ్ జగ్ జీయో .. శశాంక్ ఖైతాన్ తెర‌కెక్కిస్తున్న వేరొక చిత్రంలోనూ న‌టిస్తోంది. కొర‌టాల‌- ఎన్టీఆర్ కాంబినేష‌న్ మూవీలో క‌న్ఫ‌ర్మేష‌న్ ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.