Begin typing your search above and press return to search.

వంకాయ బికినీతో అల్లాడిస్తున్న చిల్లియానా

By:  Tupaki Desk   |   1 Jan 2022 5:30 PM GMT
వంకాయ బికినీతో అల్లాడిస్తున్న చిల్లియానా
X
వంకాయ బికినీలో ఒంపుసొంపుల చిల్లియానా స‌రాగాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఈ గోవా బ్యూటీ న్యూఇయ‌ర్ ట్రీట్ ఓ రేంజులో ఉంది మ‌రి. 1 జ‌న‌వ‌రి 2022 స్పెష‌ల్ డేని ఇలియానా ఎంతో స్పెష‌ల్ గా రంజుగా ప్రారంభించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన వంగ‌పువ్వు రంగు బికినీ మైండ్ బ్లాక్ చేసింది. అలా 110 డిగ్రీస్ కోణంలో ఒంపుసొంపుల దేహ‌శిరుల్ని తెర‌ప‌రిచేసిన ఇలియానా సెల్ఫీ లుక్ వ్వావ్ అన‌కుండా ఉండ‌లేం.

ఆడియోస్ 2021! మీరు చాలా అందంగా ఉన్నారు.. కానీ మీరు మిస్ కాకూడదు! 2022 నేను నిన్ను చాలా బ్లడీగా తయారు చేస్తాను!! అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. ఇలియానా బీచ్ బేబీ గానే కాదు.. ఫిట్ నెస్ ఫ్రీక్ గా.. పాజిటివ్ మైండెడ్ పర్సన్ గా అభిమానుల‌కు సుప‌రిచితం. ఆమె తరచుగా బికినీ లుక్ ల‌ను పోస్ట్ చేస్తుంది. ఫాలోవ‌ర్స్ కి ప్రధాన ఫిట్‌నెస్ లక్ష్యాలను నిర్దేశిస్తుంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఇలియానా డి'క్రూజ్ 2018లో యాక్షన్-రొమాంటిక్ చిత్రం అమర్ అక్బర్ ఆంథోనిలో రవితేజతో తెలుగులో చివరిసారిగా నటించింది. అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. అటుపై రణదీప్ హుడాతో కలిసి `అన్ ఫెయిర్ అండ్ లవ్లీ`లో తదుపరి పాత్రలో కనిపించనుంది. ఇది బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వ అరంగేట్ర చిత్రం. భారతీయ సమాజంలోని ర‌క‌ర‌కాల రంగుల‌(వ‌ర్ణ విభేధాల)కు సంబంధించిన సమస్యలను ఇందులో ఎలివేట్ చేయ‌నున్నారు.